Teja Sajja: ఆ డైరెక్టర్ల వల్లే సక్సెస్ అంటున్న తేజ సజ్జా.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!

Teja Sajja: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ హనుమాన్. భారతీయ ఇతిహాసాలోని హనుమంతుని స్ఫూర్తితో వస్తున్న సినిమా ఇది. యంగ్ హీరో తేజ సజ్జ కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా జనవరి 12న థియేటర్లోకి రాబోతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన కెరియర్ గురించి, ఈ సినిమా గురించి చాలా చెప్పుకొచ్చాడు తేజ సజ్జ. మొదటిగా చిరంజీవి గురించి మాట్లాడుతూ ఈరోజు స్టేజ్ మీద మాట్లాడటానికి టెన్షన్ గా ఉంది.

 

ముందు వెనకాల అంజనీ పుత్రుడు ఉంటే మాట్లాడటానికి టెన్షన్ గా ఉంది. ఆ రాములు వారే హనుమంతుడిగా మారి మా కోసం చిరంజీవి రూపంలో వచ్చారు. ఆయన సినిమాల్లో మాత్రమే ఆపద్బాంధవుడు కాదు ఇండస్ట్రీలో అందరికీ ఆపద్బాంధవుడే ఆయనకి నేను ఏకలవ్య శిష్యుడిని ఆయనకి నా పాదాభివందనం అని చెప్పుకొచ్చాడు.

తరువాత దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించి మాట్లాడుతూ ఈ సినిమాకు అన్ని ప్రశాంత్ వర్మే. ఆయన ఎక్కుపెట్టిన బాణం మాత్రమే నేను. నన్ను ఇండస్ట్రీలోకి ఆయనే వదిలాడు నన్ను హీరోగా చేసి ఈరోజు మీ ముందు నిలబెట్టాడు. రామ్ చరణ్ కు రాజమౌళి, రవితేజకు పూరీ జగన్నాథ్, ఈ తేజకు ప్రశాంత్ వర్మ. నేను కేవలం ఉత్సవ విగ్రహంమాత్రమే, ఆయనే మూలవిరాట్ ఈ సినిమాలో మీరేం చూసినా అది ప్రశాంత వర్మే. మా నిర్మాత మమ్మల్ని నమ్మడం వల్లే ఇంత బాగా సినిమా వచ్చింది. ఆయన కోసం ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలి.

 

ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళు అందరూ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. ఒక బలహీనుడికి హనుమంతుడి ఆశీస్సులు దొరికితే ఎలా ఉంటుందో సినిమా అలా ఉంటుంది. గూస్ బంప్స్ మూమెంట్స్ ఈ సినిమాలో చాలా ఉంటాయి అని చెప్పుకొచ్చారు తేజ సజ్జ. ఈ స్పీచ్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు చిన్నవాడైనప్పటికీ ఏం స్పీచ్ ఇచ్చాడు అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతున్నారు

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -