Tejaswini: పవన్ పై అభిమానంతో బాలయ్య కూతురు అలా చేసిందా?

Tejaswini: ఈ మధ్యకాలంలో అన్ స్టాపబుల్ షో గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. రెండో సీజన్ లోనూ ఈ షో మరింత దూకుడుగా సాగుతోంది. స్టార్ హీరో బాలయ్య అన్ స్టాపబుల్2లో సందడి చేస్తున్నారు. బాలయ్య క్రమ శిక్షణకు ఎంతగానో ప్రాధాన్యత ఇస్తారు. ఆ క్రమశిక్షణతోనే తన కూతుళ్లు, కొడుకును పెంచారు. బాలయ్య కుటుంబం సాధారణంగా మీడియాకు దూరంగానే ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే బాలయ్య చిన్న కూతురు అయిన తేజస్వినికి మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమట.

 

ప్రస్తుతం అన్ స్టాపబుల్ షో సీజన్2 కు తేజస్విని క్రియేటివ్ కన్సల్టెంట్ గా పని చేస్తూ వస్తున్నారు. అలా పనిచేస్తున్న ఆమె గతంలో ఏ ప్రోమోలోనూ, అన్ స్టాపబుల్ సెట్స్ లోనూ కనిపించలేదు. అయితే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ లో మాత్రం తేజస్విని కనిపించడంతో అందరూ ఆమె పవన్ కు వీరాభిమాని అని ప్రచారం చేస్తున్నారు.

 

అయితే ఇది ప్రచారమేనా లేకుంటే నిజమేనా అనేది తెలియాల్సి ఉంది. ఈ ప్రచారం గురించి అధికారికంగా స్పష్టత వస్తే అందరికీ ఓ క్లారిటీ వస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తను చూసి పవన్ అభిమానులు ఎంతగానో ఆనందిస్తున్నారు. అన్ స్టాపబుల్ షోకు పవన్ హాజరైన ఎపిసోడ్ ఈ సీజన్ కు ఇదే ఆఖరి ఎపిసోడ్ కావడం విశేషం. అందుకే ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్ స్టాపబుల్ షో అంచనాలను మించి మెప్పిస్తోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గతంలో బాలయ్య ప్రభాస్ కాంబో ఎపిసోడ్ కు రికార్డు వ్యూస్ వచ్చాయి.

 

అటు బాలయ్య ఇటు ప్రభాస్ ప్రస్తుతం వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నా అన్ స్టాపబుల్ లో మాత్రం మెరిసి కొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తే బావుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా రాబోయే పవన్, బాలయ్య కాంబో ఎపిసోడ్ కూడా అంతకుమించి సక్సెస్ అవుతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా బాగా వచ్చిందని, ఇది కూడా రికార్డు క్రియేట్ చేస్తుందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -