Jr NTR: ఎన్టీఆర్ వల్లే ఈ ప్రభుత్వం ఇలా ప్రవర్తిస్తుందట.. టాలీవుడ్ లో గుసగుసలు!

Jr NTR: టాలీవుడ్ ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి నటన విషయంలో తాతకు తగ్గా మనవడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఎన్టీఆర్ అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. ఇలా ఎన్టీఆర్ టాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక దర్శక ధీరుడు రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా.. ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్నాడు. ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్టీఆర్ గురించి కొందరు గుస్సాయిస్తున్నట్లు తెలుస్తుంది. దానికి కారణం ఏంటి అనగా.. తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి మంచిగా సపోర్ట్ చేసింది. పర్మిషన్లు అడిగితే పర్మిషన్లు.. రేట్లు అంటే రేట్ల విషయంలో ఏమాత్రం తగ్గకుండా.. తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి బాగా సపోర్ట్ చేసింది.

ఇటీవల అమిత్ షా ను ఎన్టీఆర్ కలవడం వల్ల తెలంగాణ ప్రభుత్వం మంచితనాన్ని ఫిలిం ఇండస్ట్రీ కోల్పోయినట్లు తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ పై మండి పడుతున్నట్లు ఒక హింట్ కూడా ఇచ్చింది. అదేమిటంటే.. ఎన్టీఆర్ పేరు బాలీవుడ్ లో మరోసారి వినిపించేలా.. బ్రహ్మాస్త్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ ను రాజమౌళి చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారు. కానీ ఆ ఈవెంట్ ను అక్కడ జరపుకుండా తెలంగాణ ప్రభుత్వం.. దానికి అనుమతి లేకుండా చేసింది.

ఆరోజు పర్మిషన్ కోసం ఎవరికి వారు వారికి తోచిన విధంగా కష్టపడ్డారు. చివరికి పర్మిషన్ దక్కలేదు. దీంతో ఇండస్ట్రీలో కొంతమంది.. ఎన్టీఆర్ వల్లనే తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తిస్తుందని అనుకుంటున్నారట. మరి వీటి గురించి ఎన్టీఆర్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. ఇక ఎన్టీఆర్ రాబోయే సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్ 30 ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ సినిమా డిసెంబర్ 25న విడుదలవుతున్నట్లు తెలుస్తుంది. అదే విధంగా ఎన్టీఆర్ 31 సినిమా కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -