Prabhas: ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌ కావడానికి ఆ జ్యోతిష్యుడు కారణమట.. నిజమా?

Prabhas: టాలీవుడ్‌ స్టార్‌గా ఎదిగిన రెబెల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా రేంజ్‌లో సెన్సేషనల్‌ స్టార్‌గా ఎదిగారు. వరుస క్రేజీ ప్రాజెక్టులతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నారు. ఆయన పుట్టినరోజు నేడు (అక్టోబర్‌ 23). ఇక్కడొక ఆసక్తికరమైన విషయాన్ని అందరికీ తెలియచేయాలి. అదేంటంటే ప్రభాస్‌ సినీ ఇండస్ట్రీలో రారాజుగా ఎదుగుతారని ముందు తెలుసట.

అదెలాగంటారా!. ఆయన జోతిషాన్ని చూసిన జోతిష్కుడు చెప్పిన మాటలేనట. పెట్టిన రిలీజ్‌ డేట్‌ ముహూర్తమే కారణమట. ప్రభాస్‌ నటించిన తొలి చిత్రం ఈశ్వర్‌ ఈ సినిమాకు జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వం వహించారు. ఆ సినిమా రిలీజ్‌ సమయంలో కృష్ణంరాజు, సూర్య నారాయణ రాజు కలిసి వారి కుటుంబానికి సన్నిహితుడైన ఓ జోతిష్కుడిని కలిశారు. ఆయన ప్రభాస్‌ జాతకాన్ని పరిశీలించి తెలుగు సినిమాకే కాదు.. ఇండియన్‌ సినిమాకే రారాజు కాబోయే జాతకమని చెప్పటమే కాకుండా.. సదరు జోతిష్కుడు ప్రభాస్‌ పుట్టిన తేది, సమయంను పరిశీలించి జాతక బలం ప్రకారం ఓ ముహూర్తం కూడా పెట్టారు. సాధారణంగా సినిమాలను మార్నింగ్‌ షో.. అంటే ఉదయం 8.30 నుంచి షోస్‌ మొదలు పెడతారు. కానీ ఈశ్వర్‌ సినిమా తొలి షోను పొద్దున కాకుండా ఉదయం 11 గంటల తర్వాత వేయాలని సూచిస్తూ సమయాన్ని కూడా ఫిక్స్‌ చేశారట. అలా ప్రభాస్‌ తొలి సినిమా మార్నింగ్‌ షో పడాల్సిన సమయంలో పడలేదు. జోతిష్కుడు చెప్పిన సమయానికే స్టార్ట్‌ చేశారు.

ప్రభాస్‌ డెబ్యూ మూవీ అప్పట్లో మీడియా కూడా పెద్దగా లేకపోవటంతో ఈ విషయం చాలా మంది గుర్తించలేదు. ప్రభాస్‌ పెద్ద నాన్న కృష్ణంరాజు, తండ్రి సూర్య నారాయణరాజు మాత్రం జోతిష్కుడు చెప్పినట్లే చేశారు. వారి నమ్మకం నిజమైంది.. జోతిషం కరెక్ట్‌ అయ్యింది. బాహుబలి సినిమాతో ఇండియన్‌ సినిమా రికార్డులను ప్రభాస్‌ తిరగ రాయటమే కాదు.. కలెక్షన్స్‌ పరంగా నెంబర్‌ వన్‌ హీరోగా నిలిచారు. ఇప్పటికీ ఆ సినిమాను కొట్టే సినిమా రాలేదు. ఇప్పుడు ప్రభాస్‌ వచ్చే ఏడాది ఆది పురుష్‌తో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. అలాగే సలార్‌ ప్రాజెక్ట్‌ కె వంటి క్రేజీ ప్రాజెక్టులను చేస్తున్నారు. రానున్న ప్రభాస్‌ సినిమాలపై భారీ హైప్‌ నెలకొంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -