Balayya-Chiranjeevi: బాలయ్యలో ఉన్న ఆ లక్షణం చిరంజీవిలో లేదా?

Balayya-Chiranjeevi: తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలయ్య, చిరంజీవి పేరు చెబితే చాలు ఫ్యాన్స్ ఎంతో కోలాహలం చేస్తారు. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు ఈ ఇద్దరు హీరోలు. తెలుగు సినీ ఇండస్ట్రీకి వీరిద్దరూ రెండు కళ్లు లాంటి వారని అందరూ చెబుతుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ తన సొంత హీరోలపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాజాగా బాక్సాఫీస్ ముందు ఈ ఇద్దరు హీరోల గురించి ఓ వార్త ట్రెండింగ్ అవుతోంది.

 

నందమూరి నట సింహం బాలయ్యలో ఉన్నది మెగాస్టార్ చిరంజీవిలో లేనిది అదే అంటూ అభిమానులు సోషల్ మీడియాలో చర్చను లేవదీస్తున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ ట్రెండ్ అవుతోంది. వీరసింహారెడ్డి సినిమాతో నందమూరి బాలయ్య జనవరి 12వ తేదీన థియేటర్లలో సందడి చేయనున్నాడు. ఇదే టైంలో జనవరి 13వ తేదిన మెగాస్టార్ చిరంజీవి కూడా వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ని కంపేర్ చేస్తూ మెగా ఫాన్స్ మెగాస్టార్ కి నందమూరి ఫ్యాన్స్ బాలకృష్ణకి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

 

ఇదే తరుణంలో బాలయ్యలో ఉన్న ఆ గుడ్ క్వాలిటీ చిరంజీవిలో లేదని ఫ్యాన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. నందమూరి బాలయ్యకు కోపం ఎక్కువ అని, ఆయన మనసులో ఉన్నది ఉన్నట్లుగా దాచకుండా ఫేస్ మీద మాట్లాడేస్తాడని అందరికీ తెలుసు. ఎదుటివారు ఎంతటి పెద్దమనిషి అయినా సరే తప్పు చేస్తే నిలదీయడం బాలయ్యలో ఉన్న లక్షణం అని అయితే మెగాస్టార్ చిరంజీవి ఆ టైప్ కాదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

ఎలాంటి వాడినైనా మెగాస్టార్ చిరంజీవి క్షమిస్తాడని, తనపై రూమర్స్ క్రియేట్ చేసే గాసిప్ రాయళ్లను ఎన్నోసార్లు క్షమించి వదిలేశారని, రాజకీయాలలో తనను మోసం చేసిన వారిని కూడా చిరునవ్వుతో క్షమించాడని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే బాలయ్యలో లేనిది, మెగాస్టార్ లో ఉన్నది అంటూ ఫ్యాన్స్ చర్చలేవదీస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Janasena: ఏపీలోని 21 అసెంబ్లీ స్థానాలలో జనసేన పరిస్థితి ఇదీ.. అన్ని స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందా?

Janasena: మే 13వ తేదీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీ 21 స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా జనసేన పోటీ చేస్తున్నటువంటి ఈ స్థానాల విషయంలో...
- Advertisement -
- Advertisement -