CM KCR: కేసీఆర్ విషయంలో అలా జరిగేద.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు!

CM KCR: తెలంగాణ మంత్రి హరీష్ రావు తరచూ ఏపీ మంత్రులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇలా పలుమార్లు ఈయన ఏపీ మంత్రుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా మరోసారి మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఏపీ మంత్రులకు మాట్లాడటం తప్ప చేయడం చేతకాదు అంటూ విమర్శలు కురిపించారు. ఈ విధంగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో ఆయన పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి పేర్ని నాని మంత్రి హరీష్ రావు స్వయాన సీఎం కేసీఆర్ కు మేనల్లుడు అవుతారు. కెసిఆర్ గారితో జగన్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిసినప్పటికీ ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.ఇక ఏపీ మంత్రులకు మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్న కామెంట్లపై నాని స్పందిస్తూ ఘాటుగా విమర్శలు కురిపించారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ కేసీఆర్ చాలా ముదురు ఎంతో తెలివైనవాడు కనుక. హరీష్ రావును కాస్త దూరంగా పెట్టారని లేకపోతే ఈయనకు కూడా ఎన్టీఆర్ గారికి పట్టిన గదే పడుతుందంటూ కామెంట్స్ చేశారు.హ‌రీష్‌రావుకు మేన‌మామ కేసీఆర్‌పై విప‌రీత‌మైన దుగ్ద‌, బాధ అని అన్నారు. కేసీఆర్‌పై హ‌రీష్‌కు విప‌రీత‌మైన కోపం అని ఆయ‌న చెప్పుకొచ్చారు.ఆయన ఎప్పుడెప్పుడు సీఎం పదవి నుంచి తన మామను తోసి తాను కూర్చోవాలని చూస్తున్నారని తెలిపారు.

ఇలా సీఎం పదవి కోసమే ఆయన పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తున్నారని కానీ సీఎం కేసీఆర్ ముందు జాగ్రత్తతో తనని దూరం పెడుతున్నారని తెలిపారు. ఇక మరోసారి జగన్ పై హరీష్ రావు ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తే తాము కూడా కేసీఆర్ పై విమర్శలు చేయాల్సి ఉంటుందని తెలియజేశారు.ఇకపోతే హరీష్ రావు ఇచ్చే సర్టిఫికెట్స్ ఇక్కడ ఎవరికీ అవసరం లేదని అసలు ఆయనకు మా రాష్ట్రంతో సంబంధమే లేదంటూ తెలిపారు. ఇక మంత్రి హరీష్ రావు కూడా ఎప్పుడో ఒకసారి కెసిఆర్ కు వెన్నుపోటు పొడుస్తారన్న ప్రచారం కూడా తెలంగాణలో బలంగా వినపడుతోందని పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -