Project K: లోకనాయకుడి విశ్వరూపం చూసేది అప్పుడేనట.. ఏం జరిగిందంటే?

Project K: లోక నాయకుడు లెజెండరీ నటుడు కమల్ హాసన్  ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి ప్రాజెక్టుకే సినిమాలో భాగం కాబోతున్నారని తెలిసిందే. ఈ సినిమాలో కమల్ హాసన్ నటించిన బోతున్నారు అనే విషయం తెలియడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్ర ఎలా ఉండబోతుంది ఆయన లుక్ ఏంటి అన్న విషయం గురించి అభిమానులలో ఆత్రుత నెలకొంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్ర గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే సినిమాలో కమల్ హాసన్ చాలా క్రూరత్వం కలిగినటువంటి ఒక నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం.

 

ప్ర‌పంచాన్ని త‌న ఆధీనంలోకి తీసుకోవాల‌న్న కోరికతో ర‌గిలే స్వార్థ‌ప‌రుడిగా క‌మ‌ల్ క‌నిపించ‌నున్నార‌ని టాక్. క‌లియుగం అంతానికి క‌ల్కి జ‌న్మిస్తాడ‌ని ఓ క‌థ ప్ర‌చారంలో ఉంది. అస‌లు ఈ యుగం ఎలా అంతం అవుతుంది? ఎవ‌రి వ‌ల్ల‌ అంతం అవుతుంది? అనేది మ‌రింత ఆస‌క్తిదాయ‌కం.ఇలాంటి యుగాంతానికి కారణమైన ఓస్వార్థపూరిత వ్యక్తి పాత్రలో కమల్ హాసన్ నటించబోతున్నారని తెలుస్తుంది.

 

ఈ విధంగా ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్ర చాలా భయంకరంగా ఉండబోతుందన్న విషయం తెలియడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇలాంటి నెగటివ్ పాత్రలో నటిస్తున్నటువంటి కమల్ హాసన్ ఈ సినిమాలో ఎలాంటి లుక్ లో కనిపించబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మరి ఈ ఉత్కంఠత వీడాలి అంటే త్వరలోనే ఈ సినిమా నుంచి కమల్ హాసన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయాల్సి ఉంటుంది.

 

 

Related Articles

ట్రేండింగ్

Budi Mutyala Naidu: వైసీపీ ఎంపీ అభ్యర్థికి “సన్” స్ట్రోక్.. తండ్రి ఓటమి కోసం కొడుకు ప్రచారం చేస్తున్నారా?

Budi Mutyala Naidu:  రాష్ట్ర ఎన్నికలలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాల ముందు కుటుంబ బంధాలు ఓడిపోతున్నాయి. ఇంతకుముందు టెక్కలి లో ఇలాంటి ఘటన ఒకటి చూసాము, ఇప్పుడు అనకాపల్లి పార్లమెంటు...
- Advertisement -
- Advertisement -