YCP: వైసీపీ పరిస్థితి దారుణం.. రాష్ట్రంలో పుంజుకునే అవకాశం లేదా?

YCP: ఏపీలో ఆ ఐదేళ్ల టర్మ్‌కు చివరి అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి. మొత్తం నాలుగు రోజులు జరిగిన సమావేశాల్లో తమ పార్టీ ఓడిపోతుందనే చాయలు వైసీపీ నేతల ముఖాల్లో కనిపించాయి. మామూలుగా అయితే, అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేల హడావుడి మామూలుగా ఉండదు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నార కనుక ఏం మాట్లాడినా చెల్లుతుంది అనేలా వ్యవహించేవారు. జగన్ ను పొగిడేవాళ్లు కొంతమంది, చంద్రబాబు, లోకేష్‌ను తిట్టేవాళు మరికొంతమంది, వీటిని విని ఎంజాయ్ చేసేవాళ్లు మిగిలిన వాళ్లు. ఇది గతంలో ఏపీ అసెంబ్లీ వైసీపీ నేతల తీరు. కానీ, ఈ నాలుగు రోజులు జరిగినవి వారి పదవీకాలానికి చివరివి. సో.. ఆ జోకులను, ఆ సెటైర్లను ఎంజాయ్ చేసేవారు ఎవరూ లేరు. రేపు మన పరిస్థితి ఏంటీ అనేలా వైసీపీ ఎమ్మెల్యేల ముఖాలు తయారైయ్యాయి. సింపుల్‌గా చెప్పాలంటే.. గ్రాడ్యూవేషన్ పూర్తి చేసుకున్న స్టూడెంట్స్ కాలేజ్‌కి లాస్ట్ రోజు ఎలా ఫీల్ అవుతారు? కాలేజీని వదిలేస్తున్నామనే బాధకంటే.. స్టూడెంట్ లైఫ్‌కి ఎండ్ కార్డ్ వేసి ఉద్యోగవేటలో పడాలి.. మనకు ఏమైనా జాబ్ వస్తుందా? రాకపోతే ఏం చేయాలి.

 

ఇలాంటి ప్రశ్నలు ఆ స్టూడెంట్ మదిలో మెదులుతాయి. సేమ్ సీన్ ఏపీ అసెంబ్లీలో కనిపించింది. అందుకే, అందరి ముఖాలు ఓడిపోయాయి. ఒకరో ఇద్దరో ఇంకా గంభీరంగా మాట్లాడినా.. వాటిని ఎంజాయ్ చేసే పరిస్థితుల్లో ఎవరూ లేరు. కొడాలి నాని కాస్త కాన్ఫిడెండ్‌గా మాట్లాడటం ఆయన సహజ లక్షణం. ఈ అసెంబ్లీ సెషన్స్‌లో కూడా ఆయన మాట్లాడాడు. కానీ, ఆయన స్థాయిలో స్పైసీ లేదు. ఒక్కో దగ్గర సెటైర్లు వేసినా మిగిలిన ఎమ్మెల్యేల నుంచి పెద్దగా సపోర్టు రాలేదు. గతంలో కొడాలి నాని మాట్లాడితే.. బల్లల్లు చరుస్తూ సపోర్టు చేసేవారు. కానీ, ఆ సారి సీన్ మారింది. మనకెందుకు వచ్చిన గోల అనుకుంటూ అంతా సైలెంట్ గా ఉన్నారు. ఇదంతా ఓటమి భయమేనని పరిశీలకులు అంటున్నారు. అదే సభలో ప్రత్యర్థ పార్టీ నేతలను దుర్భాషలాడిన రోజులు గుర్తు వచ్చినట్టు ఉన్నాయి. కాలం ఎంత బలమైనదో ఇప్పుడు అర్థమైనట్టు ఉంది. ఐదేళ్లు ఇలా గడిచిపోయాయి. పైగా అధికారపార్టీ ఎమ్మెల్యేలు కదా.. ఇంకా త్వరగా గడిచిపోయినట్టు అనిపిస్తాయి. రేపు ఎన్నికల్లో గెలిచి మళ్లీ అసెంబ్లీకి వస్తామా? వచ్చినా అధికారంలోకి వస్తామా? ఇన్ని ప్రశ్నలు.

 

అంతేకాదు, తర్వలో రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. దానికి మాక్ పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. మామూలుగా అయితే.. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ చాలా కష్టం. రెండు, మూడు సార్లు ప్రాక్టిస్ చేస్తే కానీ.. అర్థం కాదు. అందుకే మాక్ పోలింగ్ జరగాల్సి ఉంది. కానీ, నిర్వహించలేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ఏ రోజు చూసుకున్నా వైసీపీ నుంచి 70 మంది కూడా దాటలేదు. ఇక, వైసీపీ ఎమ్మెల్యేలు అంతర్మధనంలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఈసారి అందరూ సైలంట్ అయ్యారట. పాలసీలపై కాకుండా ఈ ఐదేళ్లు అనవసరంగా వ్యక్తిగత దూషణలు చేశామని అనుకుంటున్నారట. దీని వలన ప్రత్యర్థులకు శుత్రువుగా మారడమే తప్పు ప్రయోజనం లేదని అర్థం చేసుకున్నారని టాక్. ఇప్పటికైనా టీడీపీ నేతలతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడం మంచిదని ఆలోచనలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని టాక్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -