Health: ఓవర్‌ టైం వర్క్‌ చేస్తే వచ్చే రోగాలు, సమస్యలు ఇవే!

Health: గతంలో ఉద్యోగం అంటే ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆఫీస్‌లలో చేసే వారు. ఉదయం వెళ్లి నైట్‌ ఇంటికొచ్చి కాస్త రెస్ట్‌ తీసుకుంటే ఆఫీస్‌లో ఉండే టెన్షన్స్‌ అన్ని పోయేవి. గత రెండున్నర ఏళ్లుగా కరోనా కారణంగా ఆఫీసులన్నీ మూతపడ్డ కారణంగా ఇంటి నుంచి వర్క్‌ఫ్రం హోమ్‌ చేస్తున్నారు. వర్క్‌ ఫ్రం హోమ్‌ కారణంగా చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తోంది. నేరుగా ఆఫీస్‌కు వెళ్లి పని చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్‌ ఐతే అక్కడే ఉండే బాస్‌ దృష్టికి తీసుకెళ్లి ప్రాబ్లమ్‌ను స్వాలో చేసుకునే వారు. వర్క్‌ ఫ్రం హోం కారణంగా పనిలో మిస్టేక్‌ వస్తే జూమ్‌ మీటింగ్‌ అంటూæ గంటల తరబడి ల్యాప్‌ట్యాప్‌ ముందు కూర్చుని పనిభారంతో ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో ఉద్యోగులు ఎక్కువ సమయం పనిలో నిమగ్నం అవుతున్నారు.

అయితే ఓవర్‌ టైం పని చేసే ఉద్యోగుల్లో వివిధ రకాల వ్యాధులు వస్తాయా? వారి శరీరంలో వచ్చే మార్పులు ఎలాంటివి ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగుల్లో వారి శరీరంలో మార్పులు ఇవే.. ఓవర్‌ టైం వర్క్‌ చేసేవారిలో అలసట, గ్యాస్‌ట్రబుల్, ఒళ్లు నొప్పుడు, కండరాల్లో విపరీతమైన నొప్పి, అధిక రక్తపోటు, కొలస్ట్రాల స్థాయి పెరగడం, గుండెపోటు, మధుమేహంతో పాటు ఇతర వ్యాధులు సోకే ప్రమాదం ఉందంటున్నారు వైద్య నిపుణులు, మరికొన్ని సందర్భాల్లో ప్రాణాంతకర వ్యాధులు, ప్రాణాలు సైతం పోగొట్టుకునే పమాదం ఉందన్నారు వైద్యులు. ఇలాంటి వారిలో హైపర్‌ టెన్షన్స్‌ హార్ట్‌ డిసిజర్స్‌ వస్తున్నట్లు గుర్తించారు. కరోనా తర్వాత సాఫ్ట్‌వేర్‌ రంగం మొత్తం ఇళ్లనుంచి పనులు చేయడంతో భిన్నవిభిన్న వ్యాధులకు గురవుతున్నట్లు హెల్త్‌ ఆర్గనైజేషన గుర్తించింది. ప్రపంచ వ్యాప్తంగా మూడొంతుల ప్రజలు ఎక్కువగా ఓవర్‌టైం పనిచేస్తున్నట్లు గుర్తించారు.

వారానికి 55 గంటల కన్న ఎక్కువగా పనిచేస్తే అది ఓవర్‌ టైం కింద పరిగణిస్తారని తద్వారా వివిధ అనార్యోగ సమస్యలు తలెత్తాయన్నారు. ఓవర్‌టైం పనిచేసే వారిలో కోపం మానసిక రుగ్మతతో పాటు నిద్రలేమి సమస్యలు వేధిస్తుననట్లు అధ్యాయనం ద్వారా తెలిసింది. ఇలాంటి వారు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు ఆత్మీయంగా ఉండలేకపోతున్నారన్నారు. వీరిలో యవ్వనపు వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు వస్తున్నట్లు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -