Chiranjeevi: చిరు నోటి నుంచి ఆ సినిమా డైలాగ్..ఫ్యాన్స్ షాక్

Chiranjeevi: సంక్రాంతి కానుక‌గా మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా వాల్తేరు వీర‌య్య విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించి రెండు రోజులకు ముందే ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ లో మెగాస్టార్ చిరంజీవి ఊర మాస్ గెటప్ లో కనిపంచారు. అందులో ఆయ‌న మేన‌రిజ‌మ్స్‌, డైలాగ్స్ అన్నీ కూడా ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వింటేజ్ చిరును అవి గుర్తుకు తెచ్చాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ట్రైలర్ లో డైలాగులు బాగా పేలాయని చెప్పొచ్చు.

 

ఆయన చెప్పిన డైలాగుల్లో.. నేను రికార్డుల్లో ఉండ‌డం కాదు.. రికార్డులే నా పేరు మీద ఉంటాయి అనేది అద్భుతంగా పేలిందని ఫ్యాన్స్ ఎంతగానో ఆనందపడుతున్నారు. నిజంగా చిరంజీవి చూడ‌ని రికార్డుల్లేవు కాబ‌ట్టి అభిమానులు ఈ డైలాగ్‌తో బాగా క‌నెక్ట‌య్యామని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ డైలాగ్ కొత్త‌ది కాక‌పోవ‌డం, ఇది వరకే ఒక సినిమాలో ఇది ఉందని మరికొందరు అంటున్నారు. మెగాస్టార్ మేన‌ల్లుడైన అయిన సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా నటించిన విన్న‌ర్ సినిమాలో ఈ డైలాగ్ ఉండటం విశేషం.

 

2017లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా విన్నర్ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ లో సాయిధరమ్ తేజ్ క‌మెడియ‌న్ పృథ్వీతో ఈ డైలాగ్ చెప్పాడు. అందులో ఆయ‌న పాత్ర పేరు సింగం సుజాత కాగా ఓ సన్నివేశంలో హీరోయిన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు సింగం సుజాత ఓ డైలాగ్ చెబుతాడని తెలుస్తోంది.

 

అయితే విన్నర్ కు వాల్తీరు వీరయ్య సినిమాకు కాస్త డిఫరెంట్ ఉంది. డైలాగ్ ఇంటెన్స్ ఒకటే అయినా చెప్పే రిథమ్ వేరని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది నెటిజన్లు మాత్రం రెండు సినిమాల వీడియోల‌ను ప‌క్క ప‌క్క‌న పెట్టి ఇంత గుడ్డిగా డైలాగ్ కాపీ కొట్టేశారేంటి అని కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -