Health Benefits: టీ తాగితే ఈ ప్రయోజనాలు మీ సొంతం

Health Benefits: ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే అడిగేది టీ. ఇంటికి స్నేహితులు వచ్చినా.. బంధువులు వచ్చినా వారికి మొదటగా ఇచ్చేది టీనే. టీ అంటే ఇష్టపడని వారుండరు. ప్రతి ఇంట్లో రోజూ రెండు పూటలు టీ తాగుతుంటారు. అలా సాధారణ సమయంలో కాకుండా మనస్సు బాగోలేనప్పుడు.. ఒత్తిడికి గురైనప్పుడు టీ తాగితే ఆ ఉల్లాసమే వేరంటున్నారు నిపుణులు.

ఇలాంటి టీపై ఓ అద్యాయనం వెల్లడైన కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. టీ ఎక్కువగా తాగితే డెత్‌ రిస్క్‌ తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నారు. టీ తాగనివారితో పోలిస్తే రోజుకు రెండు లేదా మూడు కప్పులు తాగేవారిలో మరణ ప్రమాదం తక్కువని పేర్కొంటున్నారు. యూకేలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ చెందిన నేషనల్‌ క్యేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ పరిశోధకులు బ్లాక్‌ టీ వల్ల కలిగే సంభావ్య మరణాల ప్రయోజనాలపై విశేషించారు. రోజుకు రెండు కప్పులకు పైగా టీ తాగే వ్యక్తుల్లో ఏ కారణం చేతనైనా మరణించే ప్రమాదం తాగని వారికంటే 9–13 శాతం వరకు తక్కువని.. 40 – 69 ఏళ్ల వయసు గల 4,98,043 మంది పురుషులు, స్త్రీలు ఈ అధ్యయనంలో పాల్గొని వీరిలో 89 శాతం మంది బ్లాక్‌ టీ వెరైటీని తాగినట్లు పేర్కొన్నారు.

సుమారు 11 ఏళ్ల పాటు ఈ పద్ధతిని అనుసరించగా నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ నుంచి లింక్‌ చేయబడిన డేటాబేస్‌ నుంచి ఈ సమాచారం వచ్చింది. కెఫీన్‌ జీవక్రియలో జన్యు వైవిధ్యంతో సంబంధం లేకుండా రోజుకు రెండు కప్పులకు మించి టీ తాగితే తక్కువ మరణ ప్రమాదంతో ముడిపడి ఉంటుంది. మొత్తానికి ఈ పరిశోధనలు టీ అధిక స్థాయిలో తీసుకోవడం కూడా ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం కావచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే ఇక్కడ బ్లాక్‌ టీ తాగే అలవాటు లేకుంటే పాలు లేదా మిక్స్‌ చేసినా ఆరోగ్య ప్రయోజనాల్లో గణనీయమైన తగ్గింపు కనిపించదని నిపుణులు సలహాలు ఇస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -