Sharmila: ఆయన చెప్పడం వల్లే తెలంగాణలో పార్టీ పెట్టా.. షర్మిల సంచలన వ్యాఖ్యలు వైరల్!

Sharmila: వైయస్ షర్మిల తెలంగాణలో వైసీపీ పార్టీని పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈమె తెలంగాణలో ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈమెకు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. అడుగడుగునా ఈమెను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నా కూడా షర్మిల ఎవరికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ధైర్యంగా వాటన్నింటినీ దాటుకుంటూ ముందడుగు వేస్తోంది. నిత్యం ఈమె కాంట్రవర్సీల విషయంలో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంది. గతంలో ఎన్నో విషయాలలో ఈమె వార్తలు నిలిచిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా ఆమెను జైల్లో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆమె అన్ని అవస్థలు పడుతున్నా కూడా వాడి పట్ల జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందించకపోవడం ఆమెకు సహాయం చేయకపోవడం అన్నది నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయం.. ఆ సంగతి అటు ఉంచితే ఇప్పటికే ఈమెకు తెలంగాణలో ఎన్నో చేదు సంఘటనలు ఎదురైన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆమె నడుపుతున్న కారుని ధ్వంసం చేయడం పోలీసులు ఆమె కారులో కూర్చుండగానే అలానే ఆ కారుని లాక్కెళ్ళడం, మొన్నటికి మొన్న ఈమె సాధారణంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో కొందరు లేడీ కానిస్టేబుల్స్ పోలీసులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

 

చేయి చేసుకోవడంతో ఆమెను పోలీసులు అరెస్టు చేయడం జైల్లో పెట్టడంతో వెంటనే ఆమెను వైఎస్ విజయమ్మ బయటికి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇలా ఎన్ని చేదు సంఘటనలు ఎదురైనా కూడా ఆమె మనోధైర్యంతో ముందుకు వెళుతూనే ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వైఎస్ షర్మిల ఆయన కోసమే తెలంగాణలో పార్టీ పెట్టాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను మా నాన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి చెప్పడం వల్లే తెలంగాణలో వైసీపీ పార్టీని ప్రారంభించాను. అయినా అందించిన సేవలు కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకు మరొకసారి నేను కూడా అందించాలన్న తపనతో ఆయనకిచ్చిన మాటతోనే నేను అలా పార్టీని మొదలు పెట్టాను. నేను కూడా మొదట అలా పార్టీ పెట్టాలని అనుకోలేదు అని చెప్పుకొచ్చింది షర్మిల.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -