Jagan: నిరుద్యోగులను ఈడ్చేసిన పోలీసులు… జగన్ సర్కార్ కి ఇది తగున….

Jagan: తాము అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అయితే ఆయన అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి ఐదో సంవత్సరం కూడా అయిపోతున్న ఇప్పటికి ఒక జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేదు.

 

నిరుద్యోగులను బట్టి చేస్తామని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే ఆయనకు అనుకూలంగా ఉండే వాలంటీర్లను నియమించుకోవడం. పంచాయతీ వ్యవస్థను నాశనం చేయడానికి తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థను ముందు పెట్టి చూపించుకోవడం.

అయితే ఈ నాలుగేళ్లలో ఒక గ్రూప్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఒక డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ప్రకటించలేదు. ఈ నాలుగేళ్ల నుండి మెగా డీఎస్సీ ప్రకటిస్తామని మాటలైతే చెబుతున్నారు గాని చేతల్లో ఏమీ జరగలేదు. నిరుద్యోగులకు ఆసరాగా ఉంటున్నాం కొత్త ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్పడమే కానీ చేసింది శూన్యం…

 

కేవలం ప్రభుత్వ ఉద్యోగులు లేకుండా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా నిరాశ ఎదురయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ నాలుగేళ్లలో ఒక సరైన పరిశ్రమ గాని, ఐటీ కంపెనీ గాని రాలేదు. ఆంధ్రప్రదేశ్ లో యువత అంత పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు.

 

వచ్చిన కంపెనీలను జగన్మోహన్ రెడ్డి తన పైశాచికత్వంతో పక్క రాష్ట్రాలకు తరిమేస్తే ఎవరు మట్టికి కంపెనీలు పెట్టడానికి మన రాష్ట్రానికి వస్తారు. ఐటీ మంత్రి ని కంపెనీల గురించి అడిగితే కోడి గుడ్డు ఇంకా పెట్టలేదు అంటూ ఏం మాట్లాడతారో తనకే అర్థం కాకుండా మాట్లాడుతారు.

తాజాగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ నిరుద్యోగులు సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వాళ్ళని అడ్డుకొని సీఎం ఆఫీస్ కి వెళ్లకుండా పక్కకు ఈడ్చేశారు. పలువురు నిరుద్యోగుల పైన లాఠీచార్జి కూడా చేశారు. తమకు ఉద్యోగాలు కల్పిస్తామంటు ఆశ చూపిచ్చి తమ ఓట్లతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు తమని పోలీసులు చేత కొట్టించడం ఎంతవరకు సబబు అంటూ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి నిరుద్యోగుల సత్తా ఏంటో చూపిస్తామంటూ హెచ్చరించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -