YS Sharmila: వైయస్ కు అసలైన వారసురాలు షర్మిలానే అనిపించుకుంటుంది….

YS Sharmila: రాష్ట్రంలో వైయస్ షర్మిల సీరియస్ గా రాజకీయాలు చేయాలని డిసైడ్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పదవిని షర్మిల కి కట్టబెట్టింది. ఈనెల 21 తారీఖున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బాధ్యతలను షర్మిల చేపట్టనుంది. ఈ కార్యక్రమం అంతా ఇడుపులపాయలోని వైయస్ సమాధి వద్ద నుండి జరగనుంది. దీని ద్వారా షర్మిల తన ఉద్దేశం ఏంటో చెప్పకనే చెబుతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అసలైన వారసరాలు తానేనని స్పష్టం చేయాలనుకుంటుంది.

 

జగన్మోహన్ రెడ్డి తన తండ్రి చావుని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా తన సొంతం చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు.తనకు అవసరమైనప్పుడు సొంత తల్లిని, చెల్లిని వాడుకుని అధికారం చేపట్టిన తర్వాత వారిని బయటికి గెంటేశారు. అయితే షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తన అన్నని కేవలం ప్రత్యర్థిగా మాత్రమే చూస్తున్నట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి షర్మిలాని దూరం పెట్టినప్పుడు ఆమె చాలా మనస్థాపానికి గురి అయ్యారు. తన అన్న తనని వాడుకుని వదిలేసారని దగ్గర వారితో చెప్పుకున్నారట.

ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా….వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వెళ్లిన కాంగ్రెస్ ఓటు బ్యాంకు ని వెనక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డికి గట్టి దెబ్బ గానే చెప్పాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి షర్మిల ప్రత్యర్థి కాబట్టి ఆమె పైన కూడా తీవ్ర విమర్శలకు దిగుతారు. మరోపక్క షర్మిల చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని కూడా కలవడం అసలైన రాజకీయాలకు దిగినట్లుగా తెలుస్తుంది.

 

వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు కాంగ్రెస్ కి చెందిన వారే అని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కేవలం తన తండ్రి ఫోటోలు వాడుకుని రాజకీయాలు చేస్తున్నారు తప్ప తన తండ్రి ఆశయాలను ఏమాత్రం కొనసాగించే ఉద్దేశం జగన్ కి లేదని చెబుతున్నారు. వైయస్ ఆశయాలు సాధించేది షర్మిల మాత్రమేనని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -