Allu Arjun: అల్లు అర్జున్ ఆ నటుడు కళ్ళజోడును పగలకొట్టడానికి కారణం ఇదే!

Allu Arjun: టాలీవుడ్ ప్రేక్షకులకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. గంగోత్రి సినిమా ద్వారా హీరోగా పరిచయమైన అల్లు అర్జున్.. ఆ తర్వాత వచ్చిన ఆర్య సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన బన్నీ సినిమాతో.. అల్లు అర్జున్ ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు.

నిజానికి అల్లు అర్జున్ కి బన్నీ సినిమా మంచి గుర్తింపు సంపాదించి పెట్టిందని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తెలుగు ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇటీవల వచ్చిన పుష్ప సినిమా ద్వారా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. పుష్ప సినిమాలో బన్నీ తన చిత్తూరు యాసతో పాన్ ఇండియా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్ టు చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా కెరీర్ పరంగా అల్లు అర్జున్ మూడు పూలు ఆరు కాయల లా వెలుగుతున్నాడు. ఇదిలా ఉంటే యాక్టర్ జనార్దన్ రావు గురించి మనందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో నటుడుగా ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇతడు.. అల్లు అర్జున్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయట పెట్టాడు. అల్లు అర్జున్ తో కలిసి సన్నాఫ్ సత్యమూర్తి సినిమా చేశాను అని తెలిపాడు.

ఆ సినిమాలో అల్లు అర్జున్ నా చెంప పగలకొట్టే సీన్ ఉంటుందని దానిలో భాగంగానే షూటింగ్ లో అటేక్ చేశారు అని తెలిపాడు. ఆ టేక్ చేసేటప్పుడు అల్లు అర్జున్ చిటికెన వేలు నా కళ్ళజోడుకు తగిలి కింద పడి పగిలిపోయింది అని తెలిపాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ వద్దన్నా వినకుండా తన మేనేజర్ తో కొత్త కళ్ళజోడు కొని నాకు ఇచ్చాడు అని తెలిపాడు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -