Sharmila: షర్మిలకు సెక్యూరిటీ పెంపు వెనుక కారణాలివే.. ఏం జరిగిందంటే?

Sharmila: వైఎస్ షర్మిల.. పదేళ్ల క్రితం జగనన్న వదిలిన బాణం. కానీ, ఇప్పుడు జగనన్న మీదకు దూసుకొస్తున్న బాణం. ఆ బాణం అపార అనుభవం ఉన్న చంద్రబాబు కంటే, అశేష అభిమాన, అనుచరణగణం ఉన్న పవన్ కంటే జగన్ ను ఇబ్బంది పెడుతుంది. అందుకే, షర్మిల ఏపీ పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాజకీయాలు కంప్లీట్ గా మారిపోయాయి. ఆమె దూకుడు స్వభావం, మాట తీరు ఏపీలో సగటు ఓటరను ఆకర్షించింది. ఏపీ మీడియా దృష్టి షర్మిల మీదకే మళ్లింది. కానీ, షర్మిల దృష్టి మాత్రం అన్న జగన్ మీదే ఉంది. వైసీపీ ఓటమే ప్రధాన లక్ష్యంగా ఆమె ప్రచారంలో దూసుకుపోతోంది. దీంతో, జగన్ అండ్ కో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చేసేదేమీ లేక వైసీపీ సోషల్ మీడియా తన సహజ లక్షణాలను బయట పెట్టింది. షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలకు దిగాయి. అంతేకాదు.. సోషల్ మీడియాలో షర్మిల, సునీతపై బెదిరింపులకు కూడా దిగారు. దీంతో, షర్మల, సునీత పోలీస్ ఫిర్యాదు చేశారు. సునీత తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, షర్మిల మాత్రం ఏపీ పోలీసులకే కంప్లైంట్ చేశారు. ఎందుకంటే, ఆమె ప్రచారం ఏపీలో చేస్తున్నారు కనుక ఏపీ పోలీసులే బాధ్యత వహించాలి. తనకు ప్రాణ హాని ఉందని.. తాను నిత్యం ప్రజల్లో ఉంటున్నానని ఏపీ డీజీపీకి తెలిపారు. తనకు సెక్యూరిటీ పెంచాలని కోరారు.

 

దీంతో, ఏపీ డీజీపీ షర్మిల సెక్యూరిటీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. భద్రత ప్రమాణల నిబంధనల మేరకు సెక్యూరిటీ పెంచుతున్నామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వన్ ప్లస్ వన్ సెక్యూరిటీని టూ ప్లస్ టూకి పెంచారు. అంటే మొత్త నలుగురు గన్ మెన్లు షర్మిలకు భద్రత కల్పిస్తారు. షర్మిలకు మొదట్లో టూ ప్లస్ టూ సెక్యూరిటీ ఉండేది. కానీ, ఆ మధ్య ప్రభుత్వం వన్ ప్లస్ వన్ కు తగ్గించింది. ఇప్పుడు షర్మిల ఫిర్యాదుతో మళ్లీ పెంచారు.

షర్మిల పీసీసీ హోదాలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆమెపై దాడి జరగొచ్చని కాంగ్రెస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అందుకే హస్తం పార్టీ నేతలు ఆమె భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఆమెకు సెక్యూరిటీ పెంచాలని డీజీపీకి లేఖలు రాశారు. ఈ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న ఉన్నతాధికారులు షర్మికలు భద్రత పెంచారు. మొత్తానికి మొదటిసారి షర్మిల విషయంలో వైసీపీ ఓ మెట్టు దిగిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -