NTR – Amit Shah: అమిత్ షా, ఎన్టీఆర్ భేటీ అందుకేనా?

NTR – Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారి తీస్తుంది. అమిత్ షా పర్యటన వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎవరూ ఊహించని విధంగా కీలక మార్పులు జరుగుతున్నాయి. అమత్ షా షెడ్యూల్ లో సడెన్ మార్పులు జరిగాయి. మునుగోడు ఉపఎన్నిక క్రమంలో అక్కడే బీజేపీ నిర్వహించిన సమరభేరీ సభకు హాజరయ్యేందుకు అమిత్ షా తెలంగాణకు వచ్చారు. అయితే అనూహ్యంగా అమిత్ షా టూర్ షెడ్యూల్ మారింది. నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావుతో భేటీ కావడం, సడెన్ గా జూనియర్ ఎన్టీఆర్ కు హోంశాఖ కార్యాలయం నుంచి ఫోన్ రావడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.

స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ ను అమిత్ షా ఆహ్వానించారు. దీంతో అమిత్ షా ఆహ్వానంతో ఆయనను జూనియర్ ఎన్టీఆర్ కలిశారు. తన ఇంటి నుంచి బేగంపేటలోని నోవాటెల్ చేరుకున్న ఎన్టీఆర్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రిసీవ్ చేసుకుని అమిత్ షా దగ్గరకు తీసుకెళ్లారు. డిన్నర్ మీటింగ్ లో ఎన్టీఆర్, అమిత్ షా ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటన బాగుందని ఇటీవల అమిత్ షా ట్వీట్ చేశారు. హైదరాబాద్ వచ్చారు కనుక స్వయంగా కలిసిన ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ నటనను ప్రశంసించడానికి అమిత్ షా ఆహ్వానించారని బీజేపీ వర్గాలు మీడియాకు ప్రకటన విడుదల చేశాయి.

ఆర్ఆర్ఆర్ సినిమాలో తన నటనకు గా ఆస్కార్ రేసులో ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ నామినేట్ అయ్యారు. అందుకే ఎన్టీఆర్ ను అమిత్ షా కలిసి అభినందనలు చెబుతారని బీజేపీ వర్గాలు చెప్పుకొచ్చాయి. కానీ దీని కోసమే ప్రత్యేకంగా పిలుపించుకుని భేటీ అవ్వాల్సిన అవసరం లేదని, దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా జరుగుతోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలని ఆశ పడుతున్న బీజేపీ.. ఎన్టీఆర్ ను దగ్గర చేసుకోవడం ద్వారా టీడీపీ, ఆయన అభిమానులు, సెటిలర్ల ఓటు బ్యాంకు తమ వైపు మళ్లుతుందనే వ్యూహం ఉందనే కొంతమంది అంటున్నారు. ఇక కమ్మ సామాజికవర్గ ఓటర్ల ప్రభావం కూడా తెలంగాణలో ఉంది. ఎన్టీఆర్ తో భేటీ కావడం వల్ల ఆ సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించవచ్చని కాషాయ దళం భావిస్తుందని అంటున్నారు.

ఇక వీరిద్దరి భేటీలో మరో కోణం కూడా వినిపిస్తోంది. సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో ఎన్టీఆర్ కు క్రేజ్ ఉంది. దీంతో సౌత్ ఇండియా వ్యాప్తంగా ఎన్టీఆర్ క్రేజ్ ను ఉపయోగించాకోవాలని నిర్ణయానికి బీజేపీ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సౌత్ ఇండియాలో రాజనీకాంత్ ను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసింది. ఒకదశలో బీజేపీకి సపోర్ట్ గా రజనీ కనిపించారు. కానీ అనారోగ్య కారణాలతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడంతో.. గవర్నర్ పదవి ఇచ్చే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఒకప్పుడు సౌత్ ఇండియాలో బీజేపీకి వెంకయ్య నాయుడు పెద్దన్నలా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కూడా రాజకీయంగా సైలెంట్ అయ్యారు.

ఈ క్రమంలో సౌత్ ఇండియాలో ఎన్టీఆర్ సేవలను బీజేపీ ఉపయోగించుకోనుందనే వార్తలు పొలిటికల్ సర్కిల్స్ లో ఉపయోగిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషలు వచ్చు. ఈ నాలుగు బాషల్లోనూ అనర్గళంగా మాట్లాడగలడు. దీంతో సౌత్ ఇండియాలో బీజేపీకి మద్దతుగా ఉండాలని ఎన్టీఆర్ ను అమిత్ షా కోరే అవకాశముందని అంటున్నారు. అయితే దానికి ఎన్టీఆర్ అంగీకరిస్తారా లేదా అనేది తేలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -