Sr NTR: ఎన్టీఆర్‌పై తప్పుడు ప్రచారాలు చేసిన స్టార్ హీరోయిన్.. అసలేం జరిగిందో తెలుసా?

Sr NTR: తెలుగు సినీ ఇండస్ట్రీకి మకుటం లేని మహారాజుగా సీనియర్ ఎన్టీఆర్ పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అప్పట్లో తెలుగు సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి ఎంతో శ్రమించారు. అలాగే కొత్త కొత్త ఆలోచనలతో సినీ ఇండస్ట్రీని ముందుకు నడిపారు. పౌరాణిక కథలు, యాక్షన్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల నోట అన్నగారిగా పిలిపించుకున్నారు. అయితే అప్పట్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు చేసినా.. బాలీవుడ్‌పై స్పెషల్‌గా ఫోకస్ పెట్టేవారు. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి నేరుగా ఒక సినిమా కూడా చేయాలని అనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. కేవలం దక్షిణాదికే పరిమితమయ్యారు.

అయితే సీనియర్ ఎన్టీఆర్‌కు బాలీవుడ్ మార్కెట్ సాధ్యం కాదని ఒక ప్రచారం తెరపైకి వచ్చింది. వాస్తవానికి అది నిజం కాదు. ఎందుకంటే అప్పటికే ఎన్టీఆర్ నటించిన ఆరాధన సినిమాను హిందీలో డబ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ కలెక్షన్లు వసూలు చేసింది. అయినా అక్కడి నిర్మాతలు ఆయనను ఎందుకో నమ్మలేదు. దీంతో అసలు విషయం తెలుసుకునేందుకు ఎన్టీఆరే స్వయంగా రంగంలోకి దిగారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో పదిరోజులు బస చేశారు. దీంతో అప్పట్లో బాలీవుడ్‌ని ఏలిన అగ్ర హీరోయిన్ వహీదా రెహమాన్.. ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు ఎన్టీఆర్‌ తెలుసుకున్నారు.

తెలుగు సినీ ఇండస్ట్రీని సైతం అప్పట్లో అగ్ర హీరోయిన్ల చేతిలోనే ఉండేది. ఎన్టీఆర్, అక్కినేని ఇలాగే తెలుగు ఇండస్ట్రీలో వ్యవహరించేవారు. వీరిద్దరు నటించిన సినిమాలు వంద రోజులు పక్కా అనే మాటలు వినిపించేవి. దీంతో అప్పట్లో అగ్ర హీరోలు చెప్పేదే వేదంగా నడిచేది. కానీ కొందరు అగ్ర దర్శకులు వీరి మాటలు వినే వారు కాదు. కానీ టాలీవుడ్‌కి బాలీవుడ్ ఇండస్ట్రీ పూర్తిగా భిన్నంగా ఉండేది. అక్కడ హీరోల కంటే హీరోయిన్ల పెత్తనం ఎక్కువగా ఉండేది. హీరోయిన్ల చెప్పిందే శాసనంగా పాటించేవారు. దీంతో చాలా ఏళ్లపాటు హీరోయిన్ల రాజ్యమే కొనసాగింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -