Diabetes: వీటిని క్రమం తప్పకుండా తింటే మధుమేహం దూరమవుతోంది!

Diabetes: మారుతున్న కాలానికి తీసుకుంటున్న ఆహారం తో వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వయస్సు భేదం లేకుండా అన్ని రకాల సమస్యలు చిన్నారులతో మొదలుకుని వయో వృ ద్ధులను వెంటాడుతున్నాయి. నేటి కాలంలో కుంటుంబం ఒకరికైనా మధుమేహ సమస్య వెంటాడుతోంది. అయితే మధుమేహం ఉన్న వారు ఆహారం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఉన్న ఆహారాలను అతిగా తీసుకోవడంతో మధుమేహం పెరిగే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

అంతేకాకుండా మధుమేహం ఉన్నవారు రోజు తీసుకునే ఆహారంలో కేవలం పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. మధుమేహాన్ని నియంత్రించడానికి అల్పాహారంలో తగు జాగ్రత్తలు పాటించాలంటున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఓట్స్‌ చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. అయితే మధుమేహంతో బాధపడేవారు ఓట్స్‌ను ఆమ్లెట్లా వినియోగిస్తే సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలను తగ్గించుకోవచ్చట. మొలకలలో ఉండే మూలకాలు రక్తంలో చక్కెర పరిమాణాలను సులభంగా తగ్గిస్తాయి. అందుకే వాటిని క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు.

అంతేకాకుండా వీటిని దోసలా చేసుకుని తీసుంటే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. తాజా మెంతి ఆకులు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. వాటితో పాటు ఇందులో యాంటీ డయాబెటిస్‌ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ పరాటాను ఉదయం పూట టిఫిన్‌ తీసుకుంటే మధుమేçహాన్ని క్రమక్రమంగా తగ్గించుకోవచ్చు. అయితే మధుమేహంతో బాధపడేవారు ఉడకబెట్టిన గుడ్డును ప్రతి రోజు తీసుకుంటే శరీరం దృఢంగా మారడంతో పాటు రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుడ్లలో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -