NTR: ఈ రాజకీయ నేతలు వేస్ట్.. ఎన్టీఆర్ కు ఎవరూ సాటిరారంటూ?

NTR: ఇప్పటి తరం వారికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే తెలిసిన నటుడు శివకృష్ణ.. మొదట హీరోగా పరిచయమై మూడు వరస హిట్లు కొట్టారని చాలామందికి తెలియదు. మరో మలుపు సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన శివకృష్ణ మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు.

 

తర్వాత ఆయన హీరోగా వచ్చిన రెండవ సినిమా ఈ చరిత్ర, మూడవ సినిమా ఇది కాదు ముగింపు, మూడు సినిమాలు మంచి హిట్ అందుకొని అప్పట్లో హ్యాట్రిక్ హీరోగా నిలిచాడు శివకృష్ణ. అప్పటినుంచి ఆయన నట ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. రీసెంట్ గా బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో కూడా ఆయన ఓ క్యారెక్టర్ నటించారు.

ఇక విషయానికి వస్తే ఈయన రీసెంట్ గా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ నందమూరి తారక రామారావు గురించి మాట్లాడుతూ ఆయన దైవంశ సంభూతుడని, ఆయన కాలిగోటికి కూడా ఏ రాజకీయ నాయకుడు సరిపోడని, ఆయన వేరొకరితో పోల్చదగ్గ వ్యక్తి కాదని గర్వంగా చెప్పుకున్నారు శివకృష్ణ.

 

ఆయన ఇన్స్పిరేషన్తోనే తాను సినిమాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు. అలాంటి మహానుభావులు సమాజాన్ని ఉద్ధరించడం కోసం మాత్రమే పుడతారని, నిశ్శబ్దంగా వచ్చి సమాజానికి చేయవలసింది చేసి అంటే నిశ్శబ్దంగా వెళ్ళిపోతారని చెప్పారు శివకృష్ణ. 1980 దశకంలో వచ్చిన ఆదేశం సినిమాలో ఆయన 15 లక్షలు తీసుకున్నారని అప్పటికి ఆయన వయసు 60 సంవత్సరాలని చెప్పుకొచ్చారు.

 

అంత సంపదని, అంత కెరియర్ ని వదులుకొని సమాజం కోసం మాత్రమే పనిచేసిన మహానుభావుడు ఒక నందమూరి తారకరామారావు మాత్రమే. కిలో రెండు రూపాయలు పథకాన్ని తీసుకువచ్చి సంచలనాన్ని సృష్టించిన రాజకీయ నాయకుడు ఆయన అని చెప్పుకొచ్చారు శివకృష్ణ.

 

మరి మీ అభిమాన నటుడి వెనుక రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లలేదు అని యాంకర్ ప్రశ్నించగా ఆయన మీద అభిమానంతోనే సినిమాల్లోకి వచ్చానని అప్పటికి ఇంకా నాలుగైదు సినిమాలు మాత్రమే చేశానని అందుకే సీనియర్ ఎన్టీఆర్ తనను రాజకీయాల్లోకి ఆహ్వానించినా ఒక వంద సినిమాలు చేశాక వస్తాను అని చెప్పి సున్నితంగా తిరస్కరించానని చెప్పుకొచ్చారు శివకృష్ణ.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -