Sleep: ఆ రోగాలు రాకూడదంటే సమయానికి నిద్ర పోవాలట!

Sleep: ప్రస్తుతం ఉరుకుల పరుగుల బిజిబిజీ జీవితంలో చాలా మంది సరైన నిద్ర లేక సతమతమవుతున్నారు. అనేక ఒత్తిళ్ల మధ్య కాలం గడుపుతుండడంతో నిద్ర సరిగ్గా పోవడం అనేది సమస్యగా మారింది. వాస్తవానికి నిద్ర అనేది చాలా వరకు అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. మనిషి నిద్ర పోవడం చాలా అత్యవసరం. ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒక పనితో ప్రతి ఒక్కరూ కలిసి పోతూ ఉంటారు. అలా అలిసిపోయిన శరీరానికి రెస్ట్‌ ఇవ్వాలి. లేదంటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.నిద్ర సరిగ్గా పోకపోతే శరీరంలో ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ పెరుగుతుంది. అంటే క్లోమ గ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా గ్రహించలేదు. ఫలితంగా అధిక బరువు పెరుగడంతో పాటు డయాబెటిస్‌ వెంటాడుతుంది.

ప్రతి రోజూ సరైన నిద్ర అందకపోతే థైరాయిడ్‌ వ్యాధులు, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సరిగ్గా నిద్రించని వారిలో డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన స్థాయిలు అధికంగా ఉంటాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. అలాగే నిద్ర సరిగ్గా పోకపోతే విసుగు, కోపం వంటివి వస్తాయి. శరీర మెటబాలిజం నెమ్మదిస్తుంది. ఫలితంగా మనం తినే ఆహారం ద్వారా మనకు లభించే క్యాలరీలు సరిగ్గా ఖర్చు కావు. దీంతో శరీరంలో కొవ్వు చేరుతుంది.


అంతేకాక చర్మం పొడిబారుతుంది. జుట్టు కూడా రాలడం మొదలవుతుంది. అందుకు సరైన సమయంలో దాదాపు 6–8 గంటల వరకు నిద్ర పోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అదే విధంగా ప్రతి రోజూ 8–10 గ్లాసుల పరిశుభ్రమైన నీటిని తీసుకోవాలి. అందుకే ఎంత పని ఉన్నా కూడా సరైన సమయానికి నిద్ర పోవడం ఎలాంటి సమస్యలు వేధించవని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -