Jagan: మెగా డీఎస్సీ ఇస్తామని చెప్పారు… జగన్ కి ఇది తగునా…!

Jagan: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని అంటే వేళ్ళతో లెక్కపెట్టవచ్చు. గొప్పగా చెప్పుకుంటున్న సచివాలయ పోస్టులు కూడా అవి పంచాయతీ వ్యవస్థను దెబ్బ కొట్టే విధంగా ఉన్నాయి. ఇక నాలుగు లక్షలు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి అవి కుటుంబ పోషణకు ఎంత ఉపయోగపడతాయో ఆ విషయం కూడా చెప్పాలి. వాలంటీర్లు అందరూ కూడా వైసిపి కార్యకర్తల వల్లే పని చేస్తున్నారు. ఇక వాటిని ప్రభుత్వ ఉద్యోగాలను ఎలా అనగలం.

 

ఇక సంవత్సరానికి మొదట్లో జాబ్ క్యాలెండర్ విధులు చేస్తామని గొప్పలు చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి అయిదవ సంవత్సరం కూడా వచ్చేసింది. కానీ ఇప్పటివరకు ఒక్క క్యాలెండర్ కూడా విడుదలవలేదు. క్యాలెండరు ముద్రించడంలో ఆలస్యం అవుతుందేమో అంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. మెగా డీఎస్సీ విడుదల చేస్తాము టీచర్ పోస్టులని భర్తీ చేస్తామని కూడా చెప్పారు. రాష్ట్రంలో చాలా పాఠశాలలో టీచర్లు కొరత ఉంది. వాటిని కప్పుపుచ్చుకునేందుకు పాఠశాలలను మూసేస్తున్నారు గాని కొత్త ఉద్యోగాలు మాత్రం ఇవ్వడం లేదు. అయితే ఆగ్రహించిన నిరుద్యోగులు మెగాడీసీ ప్రకటించాలని జగన్మోహన్ రెడ్డి నివాసాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు. అయితే జగన్ వారికి కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా పోలీసులు చేత పక్కకి గెంటించేశారు. మాకు ఉద్యోగాలు ఇస్తారని నమ్మి జగన్కు ఓటేస్తే జగన్ మాకు ఇచ్చిన గౌరవం ఇదే అంటూ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక జగన్ ప్రభుత్వం దిగిపోవడానికి రెండు నాలుగు సమయం ఉంది. ఈ రెండు నెలల సమయంలో మెగా డీఎస్సీ విడుదల చేసి వాటిని భర్తీ చేసేందుకు అవకాశం లేదు. అయితే ఎన్నికల స్టంట్ లో భాగంగా దిగిపోయే ముందు నోటిఫికేషన్ ఇస్తే ఎందుకు పనికిరాదు. జగన్మోహన్ రెడ్డికి నిజంగా ఒక నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈపాటికి ఒక నోటిఫికేషన్ ఇచ్చి వాటిని భర్తీ చేసేవారు. జిల్లాల పునర్విభజన జరిగి అధికారుల సంఖ్య అవసరం ఉన్నా కూడా జగన్ ఆవైపు దృష్టి సారించడం లేదు. ఇప్పుడున్న అధికారులకే సరిగ్గా జీతాలు ఇవ్వలేకపోతున్నారు. కొత్తవారు చేరితే మళ్ళీ ప్రభుత్వం మీద భారం పడుతుందని జగన్ కొత్త ఉద్యోగాల భర్తీకి మొగ్గు చూపడం లేదని అంటున్నారు. సెకండ్ నందిని నిరుద్యోగులందరికీ ఆశాభంగం తప్పలేదు. ఇక రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వేస్తే తప్ప నిరుద్యోగులకు న్యాయం జరిగే అవకాశం కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -