Project K: ప్రభాస్ ప్రాజెక్టు కే సినిమాకు పెద్ద గండం ఎదురయిందిగా.. అదేమిటంటే?

Project K: టాలీవుడ్ ప్రేక్షకులకు రెబల్ స్టార్ ప్రభాస్ గురించి పెద్దగా పరిచయమక్కర్లేదు. టాలీవుడ్ లో ప్రస్తుతం అగ్రస్టార్ హీరోగా వెలుగుతున్నాడు. బాహుబలి సిరీస్ తో ప్రభాస్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతుంది. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్టు కే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాకు డైరెక్టర్ నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక ఈ సినిమాకు ప్రేక్షకులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వరకు ముగిసిందట. అయితే ఈ సినిమాకు ఒక పెద్ద గండం ఎదురైందని సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. అదేమిటంటే ఇటీవల విడుదలైన ఒకే ఒక జీవితం సినిమా స్టోరీ లైన్ ప్రాజెక్టు కే కు దగ్గరగా ఉన్నట్లు తెలుస్తుంది. ఒకే ఒక జీవితం టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

అమ్మ కోసం హీరో టైం మిషన్ లో కాలంలో వెనక్కి వెళ్ళిపోతాడు. కాగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ప్రాజెక్టుకే స్టోరీ లైన్ కూడా దాదాపు ఇలాగే ఉంటుందట. ఈ సినిమా టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ తో డైరెక్టర్ ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నాడట. నిజంగా ఈ రెండు సినిమా స్టోరీలు ఒకే రకంగా ఉంటే ప్రాజెక్టు కే పూర్తిగా నష్టపోతుందని తెలుస్తుంది.

ఇక రెండు చిత్రాల సిమిలర్ గా ఉంటే ప్రేక్షకులకు అంత థ్రిల్లింగ్ గా ఉండదు. భారీ బడ్జెట్ తో ప్రేక్షకులను ముందుకు వస్తున్న ప్రాజెక్టు కే పూర్తిగా పరాజయ పాలవుతుందన్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్న ఈ వార్త ప్రస్తుతం ప్రభాస్ అభిమానుల్లో వణుకు పుట్టిస్తుంది. వందల కోట్ల ప్రాజెక్టు తో నిర్మించిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిస్తే దర్శక నిర్మాతల పరిస్థితి ఏమిటని కొందరు భావిస్తున్నారు. మరి ఈ విషయం గురించి డైరెక్టర్ నాగ అశ్విన్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -