Bhola Shankar: భోళా శంకర్ మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే.. మెగాస్టార్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరినట్టేనా?

Bhola Shankar: మెహర్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మిల్క్ బ్యూటీ తమన్నా కలిసి నటించిన తాజా చిత్రం భోళా శంకర్. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబందించిన సెన్సార్ కూడా పూర్తయింది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. పెద్దగా కట్స్ ఏమి లేకుండానే సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చేసింది.

చిత్రం బృందం కూడా ఈ మూవీతో వింటేజ్ మెగాస్టార్ ని ఆగస్టు 11న థియేటర్లో చూస్తారంటూ చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సెన్సార్ చేసిన సభ్యులు ఈ సినిమాకి తొలి రివ్యూ ఇచ్చారు. సెన్సార్ వారు నుంచి వచ్చిన రివ్యూ ప్రకారం.. ఇండల్ప్ మనం వింటేజ్ మెగాస్టార్ ని చూడబోతున్నామని అదేవిధంగా మెగాస్టార్ స్టైల్ కామెడీ అదిరిపోయే యాక్షన్ దానికి తోడు ఎమోషనల్ టచ్ గూస్ బంప్స్‌ వచ్చే ఎలివేషన్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు మరోసారి భోళా శంకర్ సినిమాలో కూడా అదే ఫార్ములాని ఫాలో అవుతూ వింటేజ్‌ చిరంజీవి లుక్ తోనే సినిమా మొత్తం నింపేశాడు దర్శకుడు మెహర్ రమేష్. ఇప్పుడు సెన్సార్ స‌భ్యుల‌ నుంచి వచ్చిన రివ్యూ ప్రకారం..

 

ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని తెలుస్తోంది. అదేవిధంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టైలర్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా అవి సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసాయి. మరి ఈ ఏడాది వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న చిరంజీవి భోళా శంకర్ సినిమాతో ఏ మేరకు సక్సెస్ ను అందుకుంటారు చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -