Mahi V Raghav: మహి వి రాఘవ్ అసలు పేరు ఇదే.. భూమి విషయంలో ఆయన స్పందన ఇదే!

Mahi V Raghav: మహి వి రాఘవ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జోరుగా వినిపిస్తున్న పేరు. అయితే.. ఈయన ఓ సినిమా డైరెక్టర్. కానీ, రాజకీయాల్లో చర్చకు దారి తీశారు. ఎందుకుంటే.. రీసెంట్ గా రిలీజ్ అయిన యాత్ర2 డైరెక్టర్ కమ్ ప్రోడ్యూసర్ ఈయన. ఇప్పుడు ఈయనకు సంబందించి ఓ క్విడ్ ప్రోకో వ్యవహారంపై జోరుగా చర్చ జరుగుతోంది.

 

మహి వి రాఘవ అసలు పేరు వారణాసి మహేందర్ రెడ్డి. ఈయన తల్లి పులివెందుల, తండ్రి పుంగనూరుకి చెందిన వారు. అయితే.. కృష్ణుడుతో సినిమాలు తీసుకునే మహి వి రాఘవ సడెన్ గా పొలిటికల్ సినిమాలు తీస్తున్నారేంటనే జోరుగా చర్చ జరిగింది. అయితే, దీనిపై ఆరా తీసిన వారికి విస్తుపోయే విషయాలు తెలిశాయి. యాత్ర1 కి కూడా మహి వి రాఘవ డైరెక్టర్ గా పని చేశారు. అయితే, ఆ సినిమా కొద్దోగొప్పో ఆడియన్స్ ను మెప్పించింది. దానికి కారణం రాజశేఖర్ రెడ్డిపై ప్రజల్లో ఉన్న ఆదరణ. ఆ సినిమా మొత్తం రాజశేఖర్ రెడ్డి గురించే ఉంటుంది. కానీ, యాత్ర2 సినిమా థియేటర్స్ మొదటి రోజు నుంచే ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే.. అందరికీ తెలిసిన సీఎం జగన్మోహన్ క్యారెక్టర్ కి ఎలివేషన్స్, అమాయకత్వం జోడించారు. అందుకే రెండో రోజు నుంచి ఎవరూ థియేటర్ ముఖం కూడా చూడలేదు. మొదటి రోజు కూడా ఎమ్మెల్యేలు సొంత డబ్బులతో ప్రజలకు టికెట్లు కొని ఇచ్చారు.

సినిమా స్టోరీలో కూడా పసలేదని మొదట ప్రొడ్యూసర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో, మహి వి రాఘవే నిర్మతగా వ్యవహరించారు. సినిమాలో పస లేదని చాలా మంది ప్రొడ్యూసర్లు చెప్పిన తర్వాత కూడా మరి సొంత డబ్బుతో ఎందుకు తీశారని కొందరు ఆరా తీశారు. దీంతో ఇక్కడ క్విడ్ ప్రోకో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

 

మదనపల్లిలో హార్సిలీ హిల్స్‌లో ప్రభుత్వ మహి వి రాఘవకు 2 ఎకరాల ల్యాండ్ ఇచ్చిందని తేలింది. సినిమా తీస్తే.. ల్యాండ్ ఇస్తామని జగన్ అండ్ రాఘవ మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఇందులో నిజంలేదు అనేలా మహి వి రాఘవ సామాజిక మాధ్యమంలో స్పందించారు. అయితే, కొంతమంది క్విడ్ ప్రోకో కి సంబందించి కొన్ని ఆధారాలను బయట పెట్టారు. దీంతో.. వైసీపీ సోషల్ మీడియాలో కొత్త ప్రచారం మొదలు పెట్టారు. సినీ ప్రముఖులకు గత ప్రభుత్వాలు కూడా భూములు ఇచ్చాయని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్లకు భూమి ఇచ్చారు కదా? అని తిరిగి ప్రశ్నిస్తున్నారు. అయితే, ఇక్కడ ఓ ప్రశ్న వినిపిస్తోంది. సినీ రంగంలో విశేషమైన సేవలు అందించిన వారికి ప్రభుత్వం భూములు ఇస్తుంది. దాని వలన వారు స్టూడియోలు నిర్మించి ఇండస్ట్రీని అభివృద్ధి చేస్తారని ప్రభుత్వం ఉద్దేశ్యం. కానీ.. ఈ క్విడ్ ప్రోకో వ్యవహారంతో వెలుగులోకి వచ్చిన ఈ మహి వి రాఘవ సినిమా ఇండస్ట్రీకి మర్చిపోలేని సేవలు ఏం చేశారని.. ఆయన ప్రభుత్వ భూములు ఇస్తారు? ఈ ప్రశ్నలకు వైసీపీ నేతలు సమాధానం చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -