Adipurush: ఆదిపురుష్ అసలు ఫలితం ఇదే.. ఇంత తక్కువ కలెక్షన్లా?

Adipurush: టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ఇటీవలే విడుదల అయ్యి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని ఒక వర్గం ప్రేక్షకులు ఆరోపిస్తుండగా ఇంకొందరు మాత్రం ఈ సినిమా అట్టర్ ప్లాప్ ఏమీ బాగోలేదు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు 138 కోట్లు సాధించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. వరుసగా మూడు రోజులపాటు కలెక్షన్ల సునామీని సృష్టించింది.

 

కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం నాలుగో రోజు చాలా వరకు కలెక్షన్స్ తగ్గిపోయాయి. మొదటి 3 రోజులతో పోలిస్తే, వసూళ్లు 70శాతం, ఆక్యుపెన్సీ 45 శాతం పడిపోయినట్టు చెబుతోంది ట్రేడ్. అయితే మొదటి వారాంతం ఆదిపురుష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 340 కోట్ల రూపాయలు గ్రాస్ ను కొల్లగొట్టింది. కానీ ఆ ట్రెండ్ సోమవారం కనిపించలేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు, నార్త్ బెల్ట్ లో ఆదిపురుష్ సినిమాకు వసూళ్లు గణనీయంగా తగ్గిపోయాయి.ఉత్తరాదిన శుక్ర, శని, ఆదివారాల్లో రోజుకు 35 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు సాధించి వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా, సోమవారానికి ఒక్కసారిగా ఊహించని విధంగా రూ.9 కోట్లకు పడిపోయింది.

నెగెటివ్ టాక్ కారణంగా, ఈ సినిమా హిందీలో ఇక కోలుకోవడం కష్టం అంటోంది ట్రేడ్ వర్గం. రామాయణాన్ని వక్రీకరించి తీశారనే టాక్, నార్త్ లో బాగా వ్యాపిడంతో, సినిమా చూసేందుకు ఫ్యామిలీస్ ఆసక్తి చూపించడం లేదనేది వాళ్ల విశ్లేషణ. బాలీవుడ్ లో మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆదిపురుష్ వసూళ్లు గణనీయంగా తగ్గాయి. సోమవారం ప్రతి సెంటర్ లో డ్రాప్స్ కనిపించాయి. ప్రతి సినిమాకు ఇది సహజంగా కనిపించే ట్రెండే. కాకపోతే ఆదిపురుష్ విషయంలో మాత్రం ఇది ఆందోళన కలిగిస్తోంది.ఎందుకుంటే, ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో 65 కోట్ల రూపాయల షేర్ సాధించిన ఈ సినిమా, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే అంతకుమించి వసూళ్లు రాబట్టాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -