YS Jagan: సీఎం జగన్ ను హర్ట్ చేసిన స్టార్ సింగర్ ట్వీట్ ఇదే!

YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అప్పుడప్పుడు కాంట్రవర్సియల్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. కరోనా సమయంలోనూ అది చాలా చిన్నది అనేలా వ్యాఖ్యలు చేసి అబాసుపాలయ్యారు. తాజాగా నాటునాటు పాటకు ఆస్కార్ నామినేషన్ వచ్చినప్పుడు ఏపీ సీఎం జగన్ చేసిన ట్వీట్ ప్రాంతీయ తత్వంతో ఉందని జాతీయాభిమానం జగన్ కు లేదని మండిపడిన ప్రముఖ బాలీవుడ్ సింగర్ అవార్డు వచ్చిన సందర్భంగా సీఎం జగన్ చేసిన అభినందన ట్వీట్ పై మరోసారి విరుచుకుపడ్డారు.

 

ప్రాంతీయ తత్వంతో నూతిలో కప్పలా ఉండి సముద్రం గురించి ఊహించలేకపోతున్నారని విమర్శించారు. ప్రాంతీయ విబేధాలు రెచ్చగొడుతున్నందుకు సిగ్గుపడాలన్నారు. అద్నాష్ షమీ వ్యాఖ్యలు ఘాటుగా ఉండటంతో ఇతర పార్టీల నేతలు ఎక్కువగా షమీ ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తున్నారు.
తెలుగు జెండా రెపరెపలాడుతోంది. మన జానపద వారసత్వాన్ని ఎంతో అందంగా జరుపుకునే తెలుగు పాట పట్ల నేను గర్వపడుతున్నాను. ఈ రోజు అంతర్జాతీయంగా దానికి తగిన గుర్తింపు లభించింది. రాజమౌళి, కీరవాణి, ఎన్టీఆర్, రామ్‌చరణ్ మన తెలుగు ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తెలుగు ప్రజలను భారతీయులందరినీ గర్వపడేలా చేసినందుకు ధన్యవాదాలు అని సీఎం జగన్ ట్వీట్ చేసారు. భారతీయులు గర్వపడేలా చేశారని అన్నా తెలుగు జెండా అనే సరికి షమీకి కోపం వచ్చింది.

అయితే గతంలో షమీ జగన్ పై చేసిన ట్వీట్లకు చాలా మంది వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అద్నాన్ షమీ జగన్ పై విరుచుకుపడ్డారు. ఆయనకు ఏపీ సీఎంపై ఎందుకో కోపం ఉందని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. సంగీత పరమైన విషయం కాబట్టే షమీ స్పందించారని సంగీతానికి తెలుగు లాంటి బ్యారియర్స్ ఉండవని అది జాతీయం అని షమీ భావన అని కొంత మంది అంటున్నారు. ఏది ఏమైదా ఇది వైసీపీ వారికి నచ్చటం లేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -