స్పైసి ఫుడ్ తినేవాళ్లు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.. లేకుంటే అంతే సంగతులు!

ఈ సమాజంలో చాలామంది స్పైసి ఫుడ్ ని ఇష్టంగా తింటారు. మసాలాలతో శరీరానికి చాలా మంచి జరుగుతుందని నిపుణుల సలహా. కానీ మసాలాలను ఎక్కువగా తీసుకుంటే మానవ శరీరానికి చాలా అనర్ధాలు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రతిరోజు చాలామంది బిర్యానిలు, స్పైసీగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటుంటారు. మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే అసిడిటీ, చాతిలో మంట, అజీర్తి వంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కానీ, మన దేశంలో వాడే మసాలా దినుసులు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల మసాలాతో చేసిన ఆహారాన్ని పూర్తిగా తగ్గించాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయాటిక్ ఆహారం మసాలా దినుసుల ఘాటును తగ్గించి, మనం తీసుకునే ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. అందువల్ల ఎక్కువ మసాలా ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు తలెత్తే ఆరోగ్య సమస్యల వల్ల బయటపడడానికి పెరుగు మజ్జిగ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన శరీర ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది.

మెరుగైన జీర్ణశక్తి కోసం లికోరైస్ (వేర్లతో చేసిన టీ) అత్యంత అద్భుతమని నిపుణులు చెబుతున్నారు. స్పైసి ఫుడ్ తీసుకున్న తర్వాత లికోరైస్ టీ తీసుకోవడం వలన అజీర్తి, చాతిలో మంట వంటి సమస్యలు తగ్గుతాయి. రెండు కప్పుల నీటిలో ఒక అంగుళం ముక్కలను వేసి, ఆ నీళ్లు ఒక కప్పు అయ్యేదాకా మరిగించి, ఆహారం తిన్న తర్వాత ఆ టీ ని తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. ఈ టి ని గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగాలి. మనం ఆహారం తింటున్నప్పుడు కాస్త తీపిగా ఉండే ఆహారంతో మొదలుపెట్టి, కాస్త ఉప్పుగా ఉండేవి తీసుకోవాలని, చివరిగా కాస్త చల్లని మజ్జిగ తీసుకోవడం వలన చాతిలో మంట, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి.

స్పైసీ ఆహారాలు మంచివే అని చెప్పిన నిపుణులు వాటిని ఎక్కువగా తీసుకుంటే చాలా ఆరోగ్య సమస్యలు రావచ్చు అని కూడా చెబుతున్నారు. జీర్ణాశయం, గొంతుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు మసాలా దినుసుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాంటివారు వైద్యుల సలహా మేరకు తమ ఆహారాలను తీసుకుంటే మంచిది. చివరిగా మిరపకాయల కు బదులుగా మిరియాలు వాడడం, వెల్లుల్లి, వాడాలని ఆరోగ్య నిపుణుల సలహా. వీటిని వాడడం వల్ల రుచి వస్తూనే, జీర్ణ వ్యవస్థ పై పెద్దగా భారం పడకుండా ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -