Unstoppable 2: మూడు పెళ్లిల గురించి మాట్లాడేవారు ఊరకుక్కలు.. అన్‌స్టాపబుల్‌లో బాలయ్య సంచలన వ్యాఖ్యలు!

Unstoppable 2: నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సూపర్‌కాంబో.. బాలయ్య విత్‌ పవన్‌ కళ్యాణ్‌ వేదిక ఖాయమైంది. దీని కోసం అభిమానులు ఆత్రంగా ఎదుచు చూస్తున్నారు. కొన్నాళ్ల నిరీక్షణకు తెరదించుతూ అన్‌ స్టాపబుల్‌ షోలో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్నారు. మొన్నటిదాకా కేవలం గుసగుసలు మాత్రమే అనే భావన ఉండేది. తాజాగా వాటిని నిజం చేస్తూ వీరిద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు.

 

ఈ కాంబినేషన్‌ను అనౌన్స్ చేయంతోపాటు కొన్ని విజువల్స్‌ బయటికి వచ్చాయి. ఒక్కసారిగా ఊహించని సర్ప్రైజ్ అందించారు ఆహా నిర్వాహకులు. అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ అంటేనే అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు బాలయ్య షోకి పవన్ కళ్యాణ్ వస్తే.. వీరి కాంబినేషన్ ఎలా ఉంటుందో ఊహించుకుంటూ అభిమానులు కలలుగన్నారు. ఇది నిజం కావడంతో ఇక వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.

 

ఈ షో సందర్భంగా కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. బాలయ్య పవన్‌తో ఏం మాట్లాడరనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. బాలయ్య ప్రశ్నలకు పవన్‌ ఎలాంటి సమాధానాలు చెప్పారనే టాక్‌ నడుస్తోంది. లీకైన కొన్ని సంభాషణలు దీనిపై మరింత ఉత్కంఠ పెంచాయి. బాలయ్య సంధించిన అన్ని రకాల ప్రశ్నలకు పవన్‌ మొహమాటం లేకుండా సమాధానాలు చెప్పారని తెలుస్తోంది.

 

కంప్యూటర్‌ గ్రాఫిక్‌ కోర్సు చేశా..
ఈ షోలో పవన్‌ మాటలు కొన్ని లీక్‌ అయ్యాయని తెలుస్తోంది. తాను మొదట యాక్టర్‌ కావాలని కోరుకోలేదని పవన్‌ బాలయ్యతో అన్నారట. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ కోర్సు రెండేళ్లు నేర్చుకున్నానని పవన్‌ చెప్పినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలోకి వచ్చాక త్రివిక్రమ్‌, తాను మంచి స్నేహితులం అయ్యామని పవన్‌ చెప్పారట. ఇప్పటికీ అతడు సినిమా తాను చేయలేదని త్రివిక్రమ్‌ తిడుతూ ఉంటాడని పవన్‌ సరదాగా కామెంట్‌ చేశారట. మూడు పెళ్లిళ్ల విషయం ప్రస్తావనకు రాగా.. ఇక నుంచి పవన్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడేవాడు ఎవడైనా ఊరకుక్కతో సమానం.. అంటూ బాలయ్య ఘాటుగా వ్యాఖ్యానించారట.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -