Tirumala: దొరల కాలంలో తిరుమల పాలన ఎలా ఉండేదో తెలుసా?

Tirumala: ఒకప్పటి కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో తిరుమల తిరుపతి ఆలయాల పరిపాలన ఎలా ఉండేదో చాలావరకు ఎవరికీ తెలియదు. ముఖ్యంగా ఈ తరం ప్రజలకు అప్పటి తిరుమల పరిపాలన గురించి కాస్త కూడా తెలియదు. అయితే అప్పట్లో తిరుమల పాలన ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం.

 

తిరుమల ఆలయం మొదటిసారి ప్రభుత్వం కిందికి ఆ సమయంలోనే వచ్చింది. అంతకు ముందు మాత్రం రాజ్యాలు మారినప్పుడల్లా ఆలయ పాలన ఎన్నో చేతులు మారి అలా చివరికి ఆర్కాట్ నవాబుల రాజ్యంలోకి వచ్చింది. ఇక మద్రాస్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నీ ఆర్కాట్ జాకీర్ లోకి వచ్చేవి. మహమ్మద్ అలీ ఖాన్ వల్లజ నుంచి తిరుపతిని ఈస్ట్ ఇండియా ప్రభుత్వం తీసుకుంది.

 

అయితే ఆలయాలలో బ్రిటిష్ ప్రభుత్వ జోక్యం ఉండకూడదు అని ఆలయ పరిపాలన బాధ్యతలను హతిరంజి మహంతుల చేతికి అప్పగించారు. ఆ తర్వాత వారి నుంచి ఆలయ పాలన ధర్మకర్తల మండలి కి వెళ్లగా ఇప్పటికీ అదే కొనసాగుతుంది. ఇక 1801 సంవత్సరంలో ఆలయం ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం పరిపాలన కిందికి రాగా అదే ఏడాది జులై 31న ఆర్కాట్ నవాబు నుంచి నెల్లూరు, సౌత్ నార్త్ ఆర్కాట్ జిల్లాలు కంపెనీ పాలన కిందికి వచ్చాయి.

 

ఆ సమయంలో తిరుమల నార్త్ ఆర్కాట్ జిల్లాలో ఉండగా.. ఆ సమయంలో ఆ జిల్లా కేంద్రం చిత్తూరు. అయితే ఆర్కాట్ ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఎందుకు స్వాధీనం చేసుకుంది అంటే.. అప్పట్లో ఆర్కాట్ నవాబుకు మైసూరు నవాబు హైదర్ అలీ, టిప్పు సుల్తానులకు మధ్య జరిగిన యుద్ధాలలో ఆ సమయంలో కంపెనీ సైన్యాలు ఆర్కాట్ నవాబుకు తోడుగా ఉన్నాయి.

 

అయితే ఆ సైన్యాలో ఖర్చు నవాబు భరించాలి కాబట్టి అది తీర్చే మార్గం లేకపోవడంతో పన్ను వసూలు చేసుకునేందుకు రాజ్యంలో కొన్ని జిల్లాలను నవాబు కంపెనీకి అప్పచెప్పారు. అలా ఆ జిల్లాలతో పాటు అక్కడున్న గుడి, గోపురాలు కూడా కంపెనీ చేతిలోకి వచ్చాయి. అలా తిరుమల కూడా కంపెనీ ఆధీనంలోకి వెళ్ళింది.

 

ఆ సమయంలో ఎటువంటి పద్ధతులు లేకపోవటంతో.. ఆలయానికి వచ్చే కానుకలు ఏం అవుతున్నాయి.. ఎవరు తీసుకుంటున్నారు అనే విషయాలు ఎవరు పట్టించుకోలేదు. దీంతో అవన్నీ తెలిస్తే కానీ ఆదాయం పెరగదు అని.. దేవుడి ఆదాయం పెరిగితే గాని తమ వాటా వసూలు కాదని తెలుసుకున్నారు. దాంతో ఆలయ పరిపాలన చూసుకోవాల్సి వచ్చింది.

 

ఆలయ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని.. దగ్గర ఉన్నాయని ఈస్ట్ ఇండియా కంపెనీ సర్వే చేయించింది. కాకుండా ఆలయ పేరు మీద వస్తున్న సొమ్ము తీసుకున్న వాళ్ళను కూడా పట్టుకొని శిక్షించారు. ఆ తర్వాత ఆలయ పరిపాలనకు కొన్ని సూచనలు చేయాలని కంపెనీ ప్రభుత్వం అతడిని కోరింది.

 

అయితే 1813లో అప్పటి చిత్తూరు కమిషనర్ బ్రూస్ ఆలయ పాలనకు నియామవళి రూపొందించారు. అలా ఆలయ పాలనకు 42 నియమాలు ఉన్నాయి. ఇక తిరుమల ఆలయాలను కొన్ని నియమాల ప్రకారం నడిపించేందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ ముందుకు వచ్చింది. ఇక 1805 జులై 12 నుంచి 1810 ఫిబ్రవరి 28 మధ్యకాలంలో ఊగ్రాణం స్టోర్స్ భాగం ఇన్చార్జ్ శీనప్ప, రామారావు అనే ఇద్దరు వ్యక్తులు ఆలయ నిధులను దుర్వినియోగపరచినట్లు తెలియటంతో కంపెనీ ప్రభుత్వం వారిద్దరిని తొలగించింది.

 

ఈ విషయాలన్నీ చరిత్ర పరిశోధకరాలు డాక్టర్ నిర్మల కుమారి తన పుస్తకంలో రాశారు. ఆ పుస్తకం పేరు హిస్టరీ ఆఫ్ హిందూ రిలీజియస్ ఎండోమెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అలా 1843 అలాగే సాగిందని తెలిసింది. అయితే అదే ఏడాది కంపెనీ లండన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆలయ పాలన వ్యవహారాలకు అధికారులు దూరంగా ఉండాలని నిర్ణయించింది.

 

హిందూ ఆలయాల అంతర్గత వ్యవహారాలలో మోక్షం చేసుకోకూడదు అని ఇంగ్లాండు నుండి కంపెనీ ప్రభుత్వానికి ఆదేశాలు వచ్చాయి. అలా ఆలయ పరిపాలన వర్గమైన హదీరాం జీ మఠానికి అప్పగించారు. కంపెనీ కాలంలో తీసుకున్న చర్యల వల్ల ఆలయంలో అలా వరకు అక్రమాలు తగ్గాయి. అంతేకాకుండా ఆలయం పాలనలో ఒక పద్ధతి కూడా వచ్చింది. అయితే ఆలయ పాలనని మఠానికి అప్పగించిన తర్వాత ఆ సమయంలో కూడా ఆరోపణలు రావటంతో ఆలయ పరిపాలన 1933లో ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఇక ఆలయం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు నిర్మల కుమారి తన పుస్తకంలో వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -