Tollywood: ఈ ప్రముఖ సెలబ్రిటీలు కక్కిన కూడు కోసం ఆశ పడుతున్నారా?

Tollywood: ఒకప్పుడు రీమేక్‌ సినిమాలు చాలా అరుదుగా కనిపించేవి. అలాంటి మూవీస్‌ చేసేందుకు హీరోలు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. ఇప్పుడు మాత్రం అలా లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి. ఇతర భాషల్లో డైరెక్ట్ చేసి, తెరకెక్కించి జనాలుకు నచ్చిన సినిమాలను రీమేక్‌ చేసేందుకు ఇష్టపడుతున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి కుర్ర హీరోల వరకు ఇదే తరహాలో ఫాలో అవుతున్నారు .

 

 

దీనిపై ఆయా హీరోల ఫ్యాన్స్‌ మాత్రం ఆగ్రహంతో ఉన్నారు. మన డైరెక్టర్లు కథలు రాయలేరా అని పలువురు నెటిజన్స్ స్టార్ సీనియర్ హీరోలపై మండిపడుతున్నారు. గతంలో మీరు నటించిన సినిమాలు ఎలా ఉన్నాయో గుర్తు చేసుకోండి. బాక్సాఫీస్ రికార్డును తిరగరాసే మన తెలుగు సినిమాలను పక్క భాష వాళ్లు రీమేక్ చేసే స్థాయికి మనం ఎదిగాం. మీరు దాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని అంటున్నారు. పక్క భాషలో రిలీజ్ అయిన హిట్ కొట్టిన సినిమాని మనం రీమిక్స్ చేయడమేంటి. ఇది కక్కిన కూడుకు ఆశపడిందే కదా అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.

 

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి రీమిక్ సినిమాగా నటించిన గాడ్ ఫాదర్, నాగార్జున రీమేక్ సినిమానీ సైతం జనాలు ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు వెంకటేష్, పవన్ కళ్యాణ్‌ని సైతం ఇదే విషయంలో టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఎక్కువగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో రీమేక్ సినిమాలపై ఇంట్రెస్ చూపిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో జనాలు బాయ్ కాట్ రీమేక్ మూవీస్ అంటూ సరికొత్త హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. తెలుగు కథలనే ఎంచుకొని సినిమాలు చేయాలని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -