Star Heroes Disaster Movies: ఈ స్టార్ హీరోల సినిమాలు అప్పట్లో ఫ్లాప్ అయ్యాయని మీకు తెలుసా?

Star Heroes Disaster Movies: సాధారణంగా ఫిలిం ఇండస్ట్రీ అన్నాక సినిమాలు ప్లాప్, అట్టర్ ప్లాప్, డిజాస్టర్లుగా నిలుస్తాయి. కానీ అప్పటి డైరెక్టర్లు, నిర్మాతలు ఈ విషయంలో ఏమాత్రం భయపడేవారు కాదు. ఎందుకంటే అప్పుడు సినిమాను తక్కువ బడ్జెట్ తో నిర్మించి, సుమారు ఒక పది లక్షల లాభానికి అమ్ముకునేవారు. ఈ విధంగా 1980 కాలంలో ఎలాంటి నష్టాలు ఎదురైనా సినీ దర్శక నిర్మాతలు ఈజీగా కోలుకునేవారు. కానీ అటువంటి కాలంలో కూడా భారీ స్థాయిలో నష్ఠాన్ని తెచ్చి పెట్టిన సినిమాలు ఉన్నాయట. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శాంతి క్రాంతి: ఈ సినిమాను అప్పట్లోనే పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. దాదాపు ముగ్గురు స్టార్ హీరోలు ఈ సినిమాలో నటించారు. కాగా ఈ సినిమా అప్పట్లోనే మూడు కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది.

అంతం: ఈ సినిమా నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల కాంబినేషన్లో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఓడిపోయిన ఈ సినిమా కోటి రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టింది.

ఆపద్బాంధవుడు: 1992లో చిరంజీవి హీరోగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ స్థాయి ప్లాపును చెవి చూసింది. దాదాపు కోటిన్నర పైనే ఈ సినిమా నష్టాన్ని ఎదుర్కొంది.

అశ్వమేధం: 1992లో విడుదలైన ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటించాడు. ఈ సినిమాకు ప్రేక్షకులు బాగానే అంచనాలు వేసుకున్నారు. కానీ ఈ సినిమా కోటి రూపాయల పైన నష్టానికి తెచ్చిపెట్టింది.

నిప్పురవ్వ: బాలకృష్ణ హీరోగా భారీ హైప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పూర్తిగా డిజాస్టర్ గా అనిపించింది. అంతే కాకుండా దాదాపు రెండు కోట్ల పైన నష్టాన్ని ఈ సినిమా ఎదుర్కొంది.

గోవిందా గోవింద: 1994లో విడుదలైన ఈ సినిమాను భారీ హైప్ తో ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమాలో నాగార్జున సరసన శ్రీదేవి నటించింది. కాగా ఈ సినిమా రెండు కోట్ల నష్టాన్ని తెచ్చి పెట్టిందట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -