Akkineni Nageswara Rao: ఏఎన్ఆర్ తో కలిసి నటించినా హిట్ అందుకో లేకపోయినా టాలీవుడ్ స్టార్స్?

Akkineni Nageswara Rao: తెలుగు సినిమా పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు గురించి పరిచయం అవసరం లేదు. దాదాపు 7 దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ విభిన్నమైన కథ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగేశ్వరరావు తుది శ్వాస వదిలేవరకు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. ఇకపోతే ఈయన అప్పట్లోనే ఎన్నో మల్టీ స్టార్ చిత్రాలలో నటించి సందడి చేయడమే కాకుండా వీరి తర్వాత తరం హీరోల సినిమాలలో కూడా నటించి సందడి చేశారు.అయితే ఈయన మొదటిసారి టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి చేసిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా నిలిచాయి.

అక్కినేని నాగేశ్వరరావు మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో మొదటిసారిగా వచ్చిన చిత్రం మెకానిక్ అల్లుడు. 1893 గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అర్జున్ నిర్మించిన ఈ చిత్రాన్ని బి.గోపాల్ దర్శకత్వం వహించారు.ఇలా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా హిట్ సాధించలేకపోయింది.

అనంతరం 1994 సంపత్ కుమార్ నిర్మాణం ప్రియదర్శన్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం గాండీవం. ఇందులో బాలకృష్ణ రోజా హీరో హీరోయిన్లుగా నటించారు.అయితే ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు మొదటిసారిగా బాలకృష్ణతో కలిసిన నటించిన ఈ సినిమా కూడా హిట్ కాలేకపోయింది.

ఇకపోతే వెంకటేష్ హీరోగా 1986 వైజయంతి మూవీస్ బ్యానర్లో మురళీమోహన్ రావు దర్శకత్వంలో వెంకటేష్ రజిని హీరో హీరోయిన్లుగా బ్రహ్మరుద్రులు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో నాగేశ్వరరావు వెంకటేష్ నటించిన ఈ సినిమా కూడా హిట్ కాలేదు.

ఇక నాగేశ్వరరావు తనయుడు నాగార్జున తో కలిసి ఎన్నో సినిమాలలో నటించారు. అయితే వీరిద్దరూ మొదటిసారిగా నటించిన చిత్రం ఇద్దరూ ఇద్దరే. 1990 అన్నపూర్ణ స్టూడియోస్ అక్కినేని వెంకట్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో మొదటిసారిగా నాగేశ్వరరావు నాగార్జున కలిసి నటించిన ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -