Chandrababu: ఒక్క ఛాన్స్ కు ఇక నో ఛాన్స్.. 2024 ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు జోస్యం నిజం కానుందా?

Chandrababu: ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత చంద్రబాబులో ఎప్పడూ కనిపించనంత ఉత్సాహం కనిపిస్తుంది. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఆయన ఒక్క చాన్స్ ప్రభుత్వానికి.. ఇక నో ఛాన్స్ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. అయితే.. తర్వాత పరిణామాలు చూస్తే చంద్రాబాబు జోస్యం నిజమయ్యేలాగే కనిపిస్తోంది. చిలకలూరిపేట సభకు వచ్చిన జనం, ఆ తర్వాత ఎక్కడిక్కడ వైసీపీ నేతలకు ప్రజల నుంచి ఎదురవుతున్న నిరసనలు చూస్తే.. వైసీపీకి ఇక నో ఛాన్స్ అనే అనిపిస్తోంది. షెడ్యూల్ వచ్చింది మొదలు.. సోషల్ మీడియాలో రావాలి జగన్ కావాలి జగన్ కు బదులు.. రావాలి నోటిఫికేషన్ .. పోవాలి వైసీపీ అంటూ ట్రోల్స్ మొదలు పెట్టారు. ఒక్క ఛాన్స్ ఇచ్చి మోస పోయామని అభిప్రాయపడుతున్నారు.

గత ఎన్నికల్లో జగన్ తీసుకున్న ఒక్క ఛాన్స్ నినాదం బాగా పని చేసింది. ఓసారి జగన్ ను కూడా చూస్తే పోలేదా? అనుకున్నారు. అప్పటికే వైసీపీని స్థాపించి 9 ఏళ్లు అవ్వడంతో ప్రజలకు కూడా జగన్ పై సానుభూతి పెరిగింది. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ తో విభేదించి జగన్ బయటకు వచ్చారు. సొంతగా పార్టీ పెట్టుకున్నారు. అప్పటి నుంచి రాజకీయంగా ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. అవినీతి కేసుల్లో 16 నెలలు జైల్లో ఉన్నారు. దీంతో.. వైసీపీపై, జగన్ పై ప్రజలులో సానుభూతి పెరిగింది. అయితే.. జగన్ జైలు నుంచి బయటకురావడం.. రాష్ట్ర విభజన జరగడం చకాచకా జరిగిపోయాయి. చివరి ఏపీ ప్రజలు కట్టబట్టలతో హైదరాబాద్ మహానగారాన్ని వదిలి వచ్చేశారు. కాబట్టి… ఇలాంటి కష్టకాలంలో అనుభవం ఉన్న నాయకుడు కావాలని ప్రజలు అనుకున్నారు. అందుకే.. 2014లో టీడీపీని గెలిపించారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించారు. ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు ప్రజల ముందు దోషిలా నిలబడాల్సి వచ్చింది. దీంతో 2019 ఎన్నికల్లో జగన్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. 30 ఏళ్ల పాటు నన్నే సీఎంగా గెలిపించాలి అనుకునేలా పాలన అందిస్తానని అన్నారు. దానికితోడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తీసుకొస్తానని అన్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఉద్యోగాలు నోటిఫికేషన్లు వెల్లవలా విడుదల చేస్తానని చెప్పారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సంపూర్ణ మధ్యపానం చేసి చూపిస్తానని చెప్పారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు.

ఇలా.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అనేసరికి.. ప్రత్యేకహోదా అంశంలో చంద్రబాబుపై కోసంగా ఉన్నవారంతా వైసీపీకి ఓటు వేశారు. కానీ.. ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఎందుకిచ్చామా అని బాధపడుతున్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చి రాష్ట్రాన్ని 30ఏళ్లు వెనక్కి నెట్టేశామని పశ్చాతాప్పడుతున్నారు. అంతేకాదు.. ఎంత త్వరగా పోలింగ్ డేట్ వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రజలకు కాస్త ఉపసమనం కలుగుతోంది. వైపీపీ నేతలు, పోలీసులు గతంలా అరాచకాలకు పాల్పడటానికి అవకాశం లేదు. అందుకే నోటిఫికేష్ కూడా వచ్చి ఎన్నికలు జరిగితే వైసీపీకి బుద్ది చెప్పడానికి రెడీగా ఉన్నారు. అందుకే సోషల్ మీడియాలో నోటిఫికేషన్ రావాలి.. వైసీపీ పోవాలి అని నినాదాలు వైరల్ చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే జగన్ ఏం చేస్తానన్నారో అన్ని గుర్తు చేసుకుంటున్నారు. ప్రత్యేకహోదా, ఉద్యోగ నోటిఫికేషన్లు, మద్యపాన నిషేదం, సీపీఎస్ రద్దు అన్ని హామీలుగానే మిగిలిపోయాయి. ఇవి చాలక ఏపీకి రాజధాని లేకుండా చేశారనే కోపం ప్రజల్లో బలంగా కనిపిస్తోంది. దీంతో ఇంకో ఛాన్స్ ఇవ్వడానికి ప్రజలు రెడీగా లేరు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -