CM KCR: ఆ పార్టీలతో టీఆర్ఎస్ పొత్తు? కేసీఆర్ తో కీలక చర్చలు

CM KCR:  వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని అందుకుని తెలంగాణలో హ్యాట్రిక్ విక్టరీ కొట్టే దిశగా సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. అందివచ్చిన అవకాశాలన్నీ అందిపుచ్చుకుంటున్నారు. ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్న టీఆర్ఎస్.. ఐప్యాక్ ప్లాన్ లను అమలు చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే బలపడుతున్న బీజేపీ, గ్రామస్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్ కు ఏ అవకాశాన్ని ఇవ్వకుండా ముందుగానే గులాబీ బాస్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. చిన్న అవకాశాన్ని కూడా కేసీఆర్ వదులుకోవడం లేదు. అందులో భాగంగా చివరికి కమ్యూనిస్టు పార్టీలతో కూడా పొత్తుకు సిద్దమైపోయారు.

వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు గత కొద్దికాలంగా వినిపిస్తున్నాయి. సీట్ల పంపకం విషయంలో కూడా క్లారిటీ వచ్చిందనే ప్రచారం కూడా జరిగింది. కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్నచోట వారికి నాలుగైదు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని కేసీఆర్ సానుకూలత తెలిపినట్లు ఊహాగానాలు వినిపించాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏ పార్టీతోనూ పొత్తు కుదుర్చుకోకుండా ఒంటరిగానే ఎన్నికల రణక్షేత్రంలోకి దిగారు.

కానీ మూడోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుగుతున్న కేసీఆర్.. బీజేపీ, కాంగ్రెస్ లకు ఏ ఒక్క అవకాశం ఇవ్వకుండా వ్యూహలు రచిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కమ్యూనిస్టుల మద్దతు కోరుతుంది. దీంతో ఆ పార్టీ కంటే ముందే కేసీఆర్ రంగంలోకి దిగి కామ్రేడ్స్ తో చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. కేసీఆర్ ప్రతిపాదనకు కమ్యూనిస్టులు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఇటీవల మునుగోడులో కమ్యూనిస్టులతో పొత్తుపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. మునుగోడులోనే కాదని భవిష్యత్తులో కూడా కమ్యూనిస్టులు తమతో కలిసి వస్తారని చెప్పారు. దీనిని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, వామపక్ష పార్టీల మధ్య పొత్తు పొడిచినట్లే అర్థమవుతుంది.

వామపక్ష పార్టీలకు 2 ఎంపీ, 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు టీఆర్ఎస్ అంగీకరించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ పై కొన్ని వర్గాల్లో వ్యతిరేక ఉంది. చాలామంది ఎమ్మెల్యేలపై నియోజకవర్గాల్లో వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో కమ్యూనిస్టుల ఓట్లను కూడా పొంది దానిని భర్తీ చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే వామపక్షాలతో పొత్తుకు సిద్దమైనట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మునుగోడులో నిర్వహించిన బహిరంగ సభలో అందుకే కేసీఆర్ ఓపెన్ గా క్లారిటీ ఇచ్చారని, వామపక్షాలతో భవిష్యత్ లో కూడా కలిసి పనిచేస్తామని శ్రేణులకు ప్రత్యక్షంగా చెప్పారని అంటున్నారు.

ప్రగతశీల, క్రియాశీల శక్తులు కలిసి పనిచేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. అందులో భాగంగానే తమతో కలిసి పనిచేందుకు ఎర్ర పార్టీలు సిద్దంగా ఉన్నట్లు కేసీఆర్ నొక్కిచెప్పారు. తన ప్రసంగంలో ఎక్కువగా వామపక్ష పార్టీల గురించే కేసీఆర్ ప్రస్తావించారు. దీనిని బట్టి చూస్తే బీజేపీని ఎదుర్కొవాలంటే కమ్యూనిస్టులు సీపీఐ, సీపీఎం పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కేసీఆర్ భావించినట్లు అర్థమవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -