YS Sharmila: షర్మిలను టార్గెట్ చేసిన టీఆర్ఎస్.. టీ పాలిటిక్స్ లో కీలక మలుపు

YS Sharmila: వైఎస్ షర్మిల గత ఏడాది కొత్త పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళుతున్నారు. అధికార టీఆర్ఎస్ టార్గెట్ గా ఆమె రాజకీయం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళుతున్నారు. వైఎస్సార్ కు ఉన్నా ఫాలోయింగ్ ను ఉపయోగించుకోవాలని షర్మిల చూస్తున్నారు. తెలంగాణలో వైఎస్సార్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వాళ్లు షర్మిలకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుం షర్మిల పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పాదయాత్రలో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై షర్మిల విరుచుకుపడుతున్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్నటివరకు అసలు షర్మిల పార్టీని, షర్మిల పాదయాత్రను టీఆర్ఎస్ అసలు పట్టించుకోలేదు. షర్మిల పార్టీ పెట్టిన సమయంలో ఆమె పార్టీ గురించి కేటీఆర్, కవిత స్పందించారు. పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చని, ఎవరి స్వేచ్చవారికి ఉందని వ్యాఖ్యానించారు. అంతేకానీ షర్మిల పార్టీప ఇప్పటివరకు టీఆర్ఎస్ నేతలెవ్వరూ తీవ్రంగా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు లేవు. కానీ షర్మిల మాత్రం కేసీఆర్ టార్గెట్ గా విమర్శల దాడి మరింత పెంచుతున్నారు.

పాదయాత్రతో పాటు ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై షర్మిల విచుకుపడుతున్నారు. అయితే ఇప్పటిరవకు సైలెంట్ గా ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు ఒక్కసారిగా షర్మిలపై నజర్ వేసింది. ఇప్పటివరకు కేసీఆర్ పై ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోని నేతలు.. ఇప్పుడు షర్మిలకు రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా షర్మిలపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడం దుమారం రేగుతోంది. షర్మిల తమ పట్ల అసభ్యకరంగా మాట్లాడుతుందంటూ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, దాస్యం వినయ భాస్కర్, లక్ష్మారెడ్డి, కాలే యాదయ్య స్పీకర్ పోచారంను కలిసి షర్మిలపై చర్యలు తీసుకోవాల్సి కోరారు.

పాదయాత్రలో భాగంగా సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆమెకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. చట్టసభల ప్రతినిధులు అనే గౌరవం లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేల హక్కులకు, గౌరవానికి భంగం కలిగించేలా నిరాధార ఆరోపణలు షర్మిల చేస్తున్నారని ఆరోపించారు. జుగాస్సాకర ఆరోపణలు చేసినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యేల ఫిర్యాదుపై స్పీకర్ పోచారం స్పందించారు.

ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫిర్యాదుపై షర్మిల ట్విట్టర్ లో స్పందించారు. స్పీకర్ తనపై చర్యలు తీసుకునేముందు మంత్రి నిరంజన్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను ఒక్కసారి చూడాలని కోరారు. ఆయన మాటలను విన్న తర్వాత తనపై చర్యలు తీసుకోవచ్చని తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -