Chiranjeevi: చిరంజీవి కోసం ఇద్ద‌రు డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్లు.. మెగాస్టార్ ఎప్పటికీ మారే ఛాన్స్ లేదా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ మూవీ లతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో చూపించారు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన నిజమైన హిట్ ని అందుకున్నది ఈ సినిమాతోనే. ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలవడంతో పాటు చిరు కెరియర్ లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాకి రికార్డులకి ఎక్కింది. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలువలేదు. రీసెంట్గా వచ్చిన బోళా శంకర్ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలవడంతో అటు మెహర్ రమేష్ తో పాటు ఇటు చిరంజీవిని కూడా ఒక ఆట ఆడుకుంటున్నారు నెటిజన్స్.

రేపు ఆగస్టు 22 ఆయన బర్త్డే కావటంతో ఆయన చేయబోయే సినిమాల గురించి ఏమైనా అనౌన్స్ చేస్తారేమో అంటూ ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు. అయితే ప్రస్తుతం మోకాళ్ళకి జరిగిన శస్త్రచికిత్స వల్ల రెస్ట్ లో ఉన్నారు చిరంజీవి. అయితే ఆయనతో సినిమాలు తీయటానికి నలుగురు డైరెక్టర్లు లిస్టులో ఉన్నారంట అందులో బంగార్రాజు సినిమా తీసిన కళ్యాణ్ కృష్ణ ఒకరు, బింబిసారా డైరెక్టర్ వశిష్ట మరొకరు.

 

అయితే మిగతా ఇద్దరూ మాత్రం ఫ్లాప్ డైరెక్టర్ల లిస్టులో ఉన్న వివి వినాయక్ ఒకరు, మరొకరు తమిళ్ డైరెక్టర్ మురుగదాస్. అయితే ఇప్పటికే వరుసగా అట్టర్ ఫ్లాప్ లు మూట కట్టుకుంటున్న చిరంజీవిని ఈ అట్టర్ ఫ్లాప్ డైరెక్టర్లకి ఛాన్స్ ఇవ్వొద్దు అంటూ ఆయన అభిమానులు తీవ్ర అభ్యంతరం తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా చిరంజీవి మారాలని పాత చింతకాయ పచ్చడి లాంటి..

 

కథలు కాకుండా కథలో కొత్తదనం ఉండేలాగా చూసుకోవాలని సినీ వర్గాల వారు సైతం అభిప్రాయపడుతున్నారు. లేదంటే మెగాస్టార్ సైతం టాప్ హీరోల లిస్టు నుంచి పక్కకి తప్పుకోవలసిన పరిస్థితి వస్తుంది అంటూ గోల పెడుతున్నారు. చూడాలి మరి బర్త్డే రోజు ఏమైనా సినిమాలు అనౌన్స్ చేస్తారా.. ఈసారైనా చిరంజీవి సరియైన నిర్ణయం తీసుకుంటారా అనేది తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -