CM Jagan Convoy: కోడికత్తి తరహాలో మరో నాటకానికి తెర లేపిన జగన్.. ఎన్నికల ముందే ఇలాంటివి జరుగుతాయా?

CM Jagan Convoy:  ఏపీలో కోడి కత్తి డ్రామా గురించి అందరికీ తెలుసు. అప్పటి ప్రతిపక్షనేత జగన్‌పై విశాఖ ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తి కోడికత్తితో దాడి చేశాడు. అతన్ని పట్టుకుంటే.. తాను జగన్ అభిమానిని అని చెప్పుకొచ్చాడు. కానీ, వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు కుట్ర అని ప్రచారం చేశారు. ఓటమి భయంతో చంద్రాబాబు.. జగన్ ను హత్య చేయడానికి కుట్ర చేశారని అన్నారు. దానికి ఏవో పనికిరాని ఆధారాలు కూడా చూపించారు. కట్ చేసి చూస్తే ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, కోడికత్తి కేసులో ఎదుగు లేదు. బొదుగు లేదు. మొన్నటి వరకూ దాడి చేసిన కోడికత్తి శ్రీను జైల్లో మగ్గిపోయాడు. అయితే, ఇప్పుడు కూడా అలాంటి కుట్రలకే తెరలేపుతున్నారా? అన్న అనుమానం వ్యక్తం అవుతుంది.

గత కొంతకాలంగా.. వైసీపీ చాలా పక్కా ప్రణాళికతతో అడుగులు వేస్తోంది. సీఎం అయిన తర్వాత తన మొదటి సంతకం వాలంటీర్ల ఫైలు పైనే అంటున్నారు. అసలు వాలంటీర్లను తొలగించినట్టు ప్రభుత్వం ప్రకటించలేదు. కానీ, టీడీపీ వలనే వాలంటీర్లను తొలగించాల్సి వచ్చిందని ప్రచారం చేస్తున్నారు. వాలంటీర్ల కోసం జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ముగిసింది. అందుకే, సీఎం అయిన తర్వాత వాలంటీర్ల ఫైలుపై సంతకం పెడతా అంటున్నారు. కానీ, ఈసీ చంద్రబాబు రాసిన లేఖ కారణంగానే వాలంటీర్లు విధుల నుంచి వైదొలగాల్సి వచ్చిందని వైసీపీ ప్రచారం చేస్తోంది. గత ఎన్నికల్లో కూడా వైసీపీ చేసిన తప్పులను టీడీపీపై నెట్టేసి చేయాల్సిన నష్టం చేసింది. ప్రజల వ్యక్తిగత సమాచారం, వివేకా హత్య, కోడికత్తి డ్రామా.. ఇలా వైసీపీ చేసి టీడీపీపై నెట్టివేస్తుంది. ఇప్పుడు కూడా అలాంటి డ్రామాలకే తెరలేపింది. వాలంటీర్ల వివాదం.. ఇప్పుడు కోడికత్త తరహాలో మరో డ్రామా నడుస్తుందా అన్న అనుమానం కలుగుతోంది.

ఒంగోలులో జగన్ బస్సు యాత్రలో అనుమానాస్పద ఘటన ఇటీవల జరిగింది. వేలమంది సెక్యూరిటీ మధ్య, పరదాలు కట్టి, ఇనుప బారికేడ్లు పెట్టుకొని జగన్ తన పర్యటిస్తున్నారు. వీటన్నింటిని దాటుకొని నేరుగా జగన్ దగ్గరకు ఓ వ్యక్తి వెళ్లడం సామాన్యమైన విషయం కాదు. కానీ, ప్రకాశం జిల్లా మార్కాపురం పొదిలిలో జగన్ కాన్వాయ్ లో ఓ వాహనంపై కంభాలపాడుకు చెందిన విష్ణు అనే వ్యక్తి దాడి చేశాడు. దీంతో.. సెక్యూరిటీ వాళ్లు ఆయన్ని అడ్డుకున్నారు. సీఎం జగన్ దగ్గరకు వెళ్లాలనే అలా చేశానని ఆయన చెప్పారు. తాను జగన్ వీరాభిమానని తెలిపాడు. తాను ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నానని.. తన తమ్ముడు చదువుకు ఏడాదికి రెండు లక్షలకు పైగా కట్టాలని చెప్పాడు. తన కష్టాలు సీఎంకు చెప్పుకోవాలనే తానుఇలా చేశానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు వస్తూ వస్తూ మధ్యలో ఆల్కహాల్ కూడా తీసుకున్నానని చెప్పాడు. అయితే, ఇదంతా ఓ డ్రామాలా ఉందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే.. సీఎం సెక్యూరిటీని దాటుకొని ఆయన కాన్వాయ్ ఓ వాహనాన్ని ద్వంసం చేసే అంత ఛాన్స్ ఉంటుందా? కాబట్టి వైసీపీయే ఏదో కుట్రకు తెరలేపుతోందని అధికారులు, ఈసీ అప్రమత్తంగా ఉండాలని టీడీపీ నేతలు సూచిస్తున్నారు. మధ్యం సేవించానని చెబుతున్న ఆ వ్యక్తి మధ్యం తాగినట్టు కూడా లేడు. అందుకే.. మరో కోడి కత్తి తరహా డ్రామాకు వైసీపీ తెరలేపిందా? అన్న అనుమానం కలుగుతుంది.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -