Uppal Stadium: అభిమానులు సిద్ధం కండి.. భాగ్యనగరంలో మరో క్రికెట్ మ్యాచ్

Uppal Stadium: తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. హైదరాబాద్‌లో త్వరలో మరో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలియజేశాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ జరగనుంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఓ మ్యాచ్ నిర్వహించేందుకు సన్నాహాలు జరుపుతున్నట్లు బీసీసీఐ అధికారులు వెల్లడించారు.

 

 

కాగా ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ ముందు హైదరాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు. జింఖానా గ్రౌండ్స్‌లో అభిమానుల మధ్య తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ కోసం 39 వేల సామర్థ్యం కలిగిన ఉప్పల్ స్డేడియం అభిమానులతో కిక్కిరిసింది.

 

ఈ నేపథ్యంలో మరోసారి భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్‌కు హైదరాబాద్ వేదిక కాబోతోంది. అయితే ఈసారి నిర్వహించే మ్యాచ్ టెస్టు మ్యాచ్. ఈ మ్యాచ్ నిర్వహణ విషయంపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారులతో బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. బోర్డర్‌- గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా నాలుగు టెస్టులు జరుగుతాయి. అందులో ఓ మ్యాచ్‌కు ఢిల్లీ వేదిక కానుంది. మిగతా మ్యాచ్‌ల నిర్వహణ కోసం అహ్మదాబాద్‌, ధర్మశాల, నాగ్‌పూర్‌, చెన్నై, హైదరాబాద్‌ రేసులో ఉన్నాయి.

 

ఐదేళ్ల తర్వాత భాగ్యనగరంలో టెస్ట్ మ్యాచ్

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్టు సిరీస్‌లో ఓ మ్యాచ్‌ను హైదరాబాద్‌కు కేటాయిస్తే సుదీర్ఘ విరామం తర్వాత ఇక్కడ టెస్ట్ మ్యాచ్ జరగనున్నట్లు తెలుస్తోంది. చివరగా ఐదేళ్ల క్రితం అంటే 2017 డిసెంబరులో హైదరాబాద్‌లో శ్రీలంకతో టీమిండియా టెస్టు మ్యాచ్ ఆడింది భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు కోసం నాగ్‌పూర్‌, చెన్నై లేదా హైదరాబాద్‌లను పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -