V V Vinayak: గాయాలపాలైనా యాక్టింగ్ ఆపని తారక్.. ఏమైందంటే?

V V Vinayak: తెలుగు టాక్ షో ‘అలీతో సరదాగా’ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. 2016లో స్టార్ట్ అయిన ఈ షో ఇప్పటివరకు 300కుపైగా ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. కమెడియన్ అలీ.. సినిమాల్లో బిజీగా ఉంటూనే.. ‘అలీతో సరదాగా’ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. సెలబ్రిటీలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, నిర్మాతలు, దర్శకులు, హీరోహీరోయిన్లకు ఆసక్తికరమైన ప్రశ్నలు అడగటం వల్ల షో విజయవంతం అవుతోంది. అయితే అప్పుడప్పుడు ఈ షో ద్వారా కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకి వస్తుంటారు. అలా ఈ షో ఎంతో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ.. టీఆర్‌పీలోనూ దూసుకెళ్తోంది.

 

తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ గెస్టుగా వచ్చారు. వి.వి.వినాయక్.. ఎన్టీఆర్‌కు జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చారు. ఆ సమయంలో షూటింగ్ స్పాట్‌లో ఉన్న అందరూ భయపడిపోయామని తెలిపారు. ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ..‘ఆది సినిమా షూటింగ్ అప్పుడు ఎన్టీఆర్‌కు గాయమైంది. అప్పుడు సెట్స్ లో అందరం భయపడిపోయాం. ఎన్టీఆర్ చేతికి గాయమైంది. ఆ నొప్పిని భరించలేక ఎన్టీఆర్ ఏడ్చేస్తున్నాడు. అప్పుడేం చేయాలో తెలియలేదు. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడున్న డాక్టర్ మమ్మల్ని ఇంకా భయపెట్టేశాడు. చేతి మణికట్టు దగ్గర ఒక మృదవైన నరం ఉంటుందని, ఆ నరం కట్ అయిందని చెప్పాడు. దానికి ఇక్కడ వైద్యం చేయలేమని, వైజాగ్‌కు తీసుకెళ్లమని తెలిపాడు. అయితే రక్తస్రావం జరగకుండా గట్టిగా కట్టు కట్టాం. ఎన్టీఆర్‌కు దెబ్బ తగలడంతో వాళ్లమ్మ గారికి కాల్ చేసి.. ‘మమ్మీ.. మమ్మీ..’ అని ఏడవడం మొదలు పెట్టాడు. మాకింక ఏం జరుగుతుందోనని భయం మొదలైంది. వైజాగ్‌కు తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ చేయించాం. అయితే గాయం తగ్గాక సన్నివేశాన్ని పూర్తి చేద్దామని ఎన్టీఆర్ చెప్పాడు. రాత్రి పూట షూటింగ్ పెట్టి.. ఒంటి చేత్తో ఫైటింగ్ చేసే సీన్‌ను షూట్ చేశాం.’ అని చెప్పారు. కాగా, వినాయక్ చెప్పిన మాటలకు ఎన్టీఆర్ ఫ్యాన్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎన్టీఆర్‌కు యాక్టింగ్ అంటే అంత ఇష్టమని, అందుకే గాయాన్ని కూడా లెక్కచేయకుండా షూటింగ్‌లో పాల్గొన్నాడని అభిమానులు ఎన్టీఆర్‌ను పొగిడేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -