Vanitha Vijayakumar: చెల్లి గురించి వనిత చేసిన కామెంట్స్ వింటే నోరెళ్లబెట్టాల్సిందే!

Vanitha Vijayakumar: ప్రముఖ సినీ నటులు మంజుల, విజయ్ కుమార్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి ఆయన కుమార్తెలు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి వనిత విజయ్ కుమార్, శ్రీదేవి కూడా హీరోయిన్స్ గా పరిచయయ్యారు. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా కొనసాగుతున్నటువంటి వనిత విజయ్ కుమార్ శ్రీదేవి ఇద్దరు కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.వనిత విజయ్ కుమార్ తన పెళ్లిల కారణంగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఈమె గత కొంతకాలంగా కూడా సినిమాలకు దూరంగా ఉన్నారు.

 

అయితే తాజాగా ఈమె పవిత్ర లోకేష్ నరేష్ కలిసి నటించిన మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే వనిత విజయ్ కుమార్ కు తన తల్లిదండ్రులతో ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తడంతో ఈమెను తన కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు పంపించారని పలు సందర్భాలలో తెలియజేశారు. అయితే తాజాగా ఈమె తన చెల్లెలు శ్రీదేవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన చెల్లెలు శ్రీదేవికి తానే రాహుల్ అనే వ్యక్తితో పెళ్లి జరిపించానని తెలిపారు. ఇలా రాహుల్ తో పెళ్లి జరిపించడంతో తను జీవితంలో ఎంతో సంతోషంగా ఉంది. తన వల్లే తన జీవితం సంతోషంగా ఉందని తన చెల్లెలు శ్రీదేవి తనతో ఎన్నోసార్లు చెప్పింది. అయితే ప్రస్తుతం మాత్రం తన చెల్లెలు తనని సోషల్ మీడియాలో అన్ని అకౌంట్స్ లో బ్లాక్ చేసిందని తెలిపారు.

 

తాను సోషల్ మీడియాలో అన్ని అకౌంట్స్ లో బ్లాక్ చేసే అంత తప్పు తానేమీ చేయలేదు అయినప్పటికీ నన్ను దూరం పెట్టిందని ఈమె తన చెల్లెలు గురించి చెప్పుకొచ్చారు. అయితే ఆస్తులు విషయంలో తనకు అందరితో సమానంగా ఆస్తి పంచకపోవడంతోనే తాను తనకు సమాన హక్కు కావాలని అడిగాను అందుకే తన తండ్రి తనని ఇంటి నుంచి బయటకు పంపించారని దాంతో నా చెల్లెలు కూడా తనని దూరం పెట్టిందంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -