Varun-Lavanya: వరుణ్ లావణ్యల పెళ్లి వేదిక ఇదేనా.. మెగా అభిమానులకు ఇది నిజంగా షాకేనంటూ?

Varun-Lavanya: మెగా కుటుంబంలో పెళ్లి భాజలు మోగబోతున్న సంగతి మనకు తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు ఇప్పటికే ఈయన నటి లావణ్య త్రిపాఠి తో కలిసి ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నటువంటి నేపథ్యంలో మెగా కుటుంబ సభ్యులు పెళ్లి పనులలో బిజీ అయ్యారు. ఇక తాజాగా వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

ఇలా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే చోటచేరీ ఘనంగా ఈ వేడుకలను ప్రారంభించారు.ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో త్వరలోనే వీరి వివాహం జరగబోతుంది అన్న క్లారిటీ అందరికీ వచ్చేసింది.

ఇకపోతే వీరి వివాహం ఎప్పుడూ ఎక్కడ అనే విషయాలను మాత్రం ఎవరు తెలియచేయలేదు కానీ మెగా కోడలు ఉపాసన మాత్రం వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి వేదిక ఎక్కడ అనే విషయాలను సోషల్ మీడియా వేదికగా బయట పెట్టేశారు. వీరి ప్రీ హెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబంధించినటువంటి ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఇటలీలోని టుస్కానీ నగరంలో వీరి వివాహం జరగబోతుందని ఉపాసన అసలు విషయం బయట పెట్టారు.

మొదటి నుంచి కూడా వీరి వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ చెప్పుకొచ్చారు కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే తమ వివాహం జరగబోతుందని వరుణ్ తేజ్ వెల్లడించారు అనుకున్నట్టుగానే ఈయన తన పెళ్లిని ఇటలీలో చేసుకోబోతున్నారని అయితే ఇటలీలోనే వీరిద్దరూ లవ్ ప్రపోజ్ చేసుకున్న నేపథ్యంలో అక్కడే తమ పెళ్లి జరగాలన్న ఉద్దేశంతో వరుణ్ తేజ్ భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరి వివాహం ఇటలీలో జరుగుతుందని తెలిసిన ఎప్పుడు జరుగుతుందనే విషయం గురించి తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -