Varun Tej: కంటెంట్ ఉన్నప్పుడే సినిమాని ఆదరిస్తారు.. మెగా హీరో కామెంట్స్ వైరల్!

Varun Tej: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కాంపౌండ్ నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యంగ్ హీరోలలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు. ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో అనంతరం హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ తాజాగా తన 13వ చిత్రం గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన విషయం మనకు. ఈ హీరో తాజాగా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తన 13వ చిత్రాన్ని చేయనున్నారు. ఈ సినిమాతో ఈయన బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు ఇదివరకే తెలియజేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సినిమాలో తాను ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో నటించడంతో ఎంతోమంది పైలెట్లను కలిసి ఎన్నో విషయాలను తెలుసుకున్నానని వెల్లడించారు. ఇక ఈ సినిమాతో తాను బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంటే ఒకవైపు సంతోషంగా ఉన్నప్పటికీ మరోవైపు కాస్త భయంగానే ఉందని తెలియజేశారు.అయినా కంటెంట్ ఉన్న సినిమాలు ఏ భాషలో అయినా భాషతో సంబంధం లేకుండా మంచి విజయాలను అందుకుంటాయనీ ఇప్పటికే ఇది నిజమని ఎన్నో సినిమాలు ప్రూవ్ చేశాయి.

ఇకపోతే తాను ఏ సినిమా కోసం పనిచేసిన ది బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ సినిమా సరైన ఫలితాలను అందుకో లేకపోయినా తాను ఏమాత్రం నిరాశ చెందననీ, ఈ హీరో వెల్లడించారు. ఇక తాజాగా ఈయన నటించిన గని సినిమా గురించి మాట్లాడుతూ.. గని సినిమా కోసం తాను ఎంతో శిక్షణ తీసుకున్నాను.ఇక ఈ సినిమా నిరాశపర్చినప్పటికీ తాను తీసుకున్న శిక్షణ నాకు ఎప్పటికైనా ఉపయోగపడుతుందని,ఇలా తాను తన జీవితంలో సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ నుంచి ఎంతో నేర్చుకున్నానని ఈ సందర్భంగా తెలియజేశారు.

Related Articles

ట్రేండింగ్

Janasena: ఏపీలోని 21 అసెంబ్లీ స్థానాలలో జనసేన పరిస్థితి ఇదీ.. అన్ని స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందా?

Janasena: మే 13వ తేదీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీ 21 స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా జనసేన పోటీ చేస్తున్నటువంటి ఈ స్థానాల విషయంలో...
- Advertisement -
- Advertisement -