Chiranjeevi: చిరంజీవిని టెన్షన్ పెడుతున్న వీరయ్య.. ఇన్ని సమస్యలా?

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ ఎదిగిన స్టార్ హీరో చిరంజీవి. కష్టార్జితంతో పైకొచ్చిన ఈ స్టార్ హీరోకు సాటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరూ లేరనేలా ఎదిగాడు. ఆ మధ్యన రాజకీయాల కోసం సినిమాల నుండి బ్రేక్ తీసుకున్న చిరంజీవి.. ఖైదీ నెంబర్ 150తో మరోసారి కంబ్యాక్ ఇచ్చాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో చిరంజీవికి అనుకున్న స్థాయిలో కెరీర్ సాగడం లేదు.

చిరంజీవి చేసిన తన డ్రీం ప్రాజెక్ట్ ‘సైరా’ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్యాన్ ఇండియా సినిమా ఇది అందరినీ ఆకట్టుకుంటుందన్న చిరు అంచనా తప్పింది. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఆచార్య సినిమా అయితే డిజాస్టర్ గా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ నటించినా కానీ కథలో బలం లేకపోవడం వల్ల సినిమా ఆడలేదు.

ఇక తాజాగా వచ్చిన ‘గాడ్ ఫాదర్’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదని అనిపించింది. అంతేకానీ మెగాస్టార్ రేంజ్ లో సినిమా భారీ కలెక్షన్లను మాత్రం రాబట్టలేకపోయింది. దీంతో ఇప్పుడు భారమంతా ‘వాల్తేరు వీరయ్య’ మీదే ఉంది. బాబీ డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమా పూర్తి మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాలయ్య ‘వీరసింహారెడ్డి’తో పోటీపడనుంది.

సంక్రాంతి బరిలో బాలయ్య, చిరు సినిమాలు పోటీపడటం కొత్తేమీ కాదు. కానీ బాలయ్య పూర్తి మాస్ ఎంటర్టైనర్ గా, ఫ్యాక్షన్ కలగలిపి చేసిన ‘వీరసింహారెడ్డి’కి మంచి పాజిటివ్ వైబ్స్ ఉండగా.. చిరు ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు ఎక్కడో అనుమానాలు తలెత్తాయి. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో వంద కోట్ల కలెక్షన్లను రాబట్టగలడా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

చిరంజీవి చేస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు ఫాంలో లేని దేవిశ్రీ ప్రససాద్ సంగీతం అందిస్తుండటం, ఈ మధ్యన పెద్దగా సక్సెస్ చూడని కోన వెంకట్ స్క్రీన్ ప్లే, ఇప్పటి వరకు బయటకు రాని హీరోయిన్ గా ఉన్న శృతి హాసన్ వల్ల సినిమాకు ఎంత వరకు ప్లస్ అవుతుందనే టాక్ నడుస్తోంది. సంక్రాంతి బరిలో ప్రతిసారి విజేత నిలిచే బాలయ్య మరోసారి అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తే.. చిరంజీవికి మరోసారి చేదు అనుభవమే ఎదురవుతుందా అనే చర్చ మొదలైంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -