Vijayawada: 17 ఏళ్లుగా లక్షల మంది ఆకలి తీరుస్తున్న విజయవాడ మహిళ.. ఎంతో గ్రేట్ అనేలా?

Vijayawada: మన చుట్టూ ఉన్న సమాజంలో చాలా మంది పేదలకు నిరుపేదలకు సేవలు చేసి, దానాలు చేసి గొప్ప గొప్ప మనసుని చాటుకుంటూ ఉంటారు. కానీ అటువంటి వారికి చాలా మందికి గుర్తింపు దక్కడం లేదు. కొంతమంది ధాన ధర్మాలు చేసినా కూడా పబ్లిసిటీ చేసుకోవడానికి అంతగా ఇష్టపడరు. కాగా అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అని అంటూ ఉంటారు. ఆ మాటలని నిజమైన నిరూపించింది మహిళ. ఒకటి రెండు కాదండోయ్ దాదాపు 17 ఏళ్లుగా లక్షల మందికి అన్నం పెడుతూ అన్నపూర్ణగా మారింది విజయవాడకు చెందిన తెల్లగడ్డ జ్యోతి కుమారి. చుట్టూ వరద నీరు. ఆ నీరు తగ్గేవరకూ కొన్ని రోజుల పాటు ఆంజనేయ స్వామి గుడిలో తలదాచుకున్నారు చాలామంది. 1977లో దివిసీమ ఉప్పెన వచ్చిన సమయంలో చుట్టుపక్కల అనేక ప్రాంతాలని వరద ముంచెత్తినప్పటి సంఘటన ఇది.

 

అలా తలదాచుకున్న వాళ్లలో జ్యోతికుమారి కుటుంబం కూడా ఉంది. బాపట్ల దగ్గర యానాదుల మా సొంతూరు. తుపాను సమయంలో మా ప్రాంతమంతా నీటిలో మునిగిపోయింది. మేమంతా రోజుల తరబడి గుడిలో తలదాచుకున్నాము. ఆర్థికంగా మాకే ఇబ్బంది లేదు కానీ. సర్వస్వం కోల్పోయి రోడ్డున పడిన వారి పరిస్థితి చూసి చాలా బాధనిపించింది. చుట్టూ శవాలు. ఎటుచూసినా ఆకలికేకలు ఆర్తనాదాలు. వీటిని ప్రత్యక్షంగా చూశాను. అప్పుడు చిన్నతనంలోని ఆ ఘటన నన్ను చాలా ప్రభావితం చేసింది. పేదల ఆకలి తీర్చడానికి ఏదైనా చేయాలని ఆరోజే అనుకున్నాము. పెళ్లయ్యాక ఆ కల నిజమైంది. 2006లో అన్నపూర్ణ ట్రస్టుని ప్రారంభించి పేదల కడుపు నింపడం మొదలుపెట్టాను అని చెప్పు కొచ్చింద్ధి. జ్యోతికుమారి.

బీకాం చదివిన ఆమె పెళ్లయిన తరువాత విజయవాడ శివార్లలోని ప్రసాదంపాడులో నివాసం ఉంటున్నారు. భర్త శ్రీనివాస్‌ ఆర్టీసీలో కంట్రోలర్‌గా పనిచేసేవారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ముందుకెళ్లాననే జ్యోతి 17 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాన్ని నిరాటంకంగా సాగిస్తున్నారు. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ.. మావారి జీతంతోనే కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ, పిల్లల చదువులు చూసుకుంటూ, పేదలకు స్వయంగా వండిపెట్టేదాన్ని. మొదట్లో ఎంత మందికి వీలైతే అంతమందికే మాకున్న దాంట్లోనే చేసేదాన్ని. చాలామంది మేం చేసే సేవ చూసి తక్కువకే బియ్యం, కాయగూరలు ఇచ్చేవారు. ఎవరైనా ఆర్థిక సాయం చేయాలని చూసినా డబ్బు రూపంలో తీసుకొనేవాళ్లం కాదు. అదేదో సరకులే కొనివ్వమని అనేదాన్ని. మధ్యలో ఆర్థిక ఇబ్బందులు వచ్చినా అన్నదానం మాత్రం ఆపలేదు. పదేళ్ల క్రితం మావారికి యాక్సిడెంట్‌ అయ్యింది.

 

దాంతో ఇంటికే పరిమితం అయ్యారు. సరిగ్గా అదే సమయానికి పిల్లలు చేతికందొచ్చారు. వాళ్లు అమెరికాలో స్థిరపడ్డారు. అమ్మాయి, అల్లుడు అమెరికాలో డాక్టర్లు. బాబు ఇంజినీర్‌. వాళ్లు సాయం చేయడం మొదలుపెట్టాక ఇబ్బందులు కాస్త తగ్గాయి. ప్రస్తుతం రోజుకి 500 నుంచి 1200 మంది ఆకలి తీరుస్తున్నాం. రెండు, మూడేళ్లుగా విజయవాడ నగరంలోని కొన్ని హోటళ్లు కూడా సహకారం అందిస్తున్నాయి. రోజువారీ మిగిలే ఆహారాన్ని మా ట్రస్టుకు అందజేస్తున్నాయి. నగరంలో ఏ కార్యక్రమం జరిగినా ఆహారం మిగిలిపోతే మాకు అందిస్తున్నారు. దీంతో రోజూ వందల మంది ఆకలి తీరుస్తున్నాము. కరోనా సమయంలోనూ ఎన్నడూ ఆపలేదు. పోలీసుల సహకారంతో ప్రజలూ, పారిశుధ్య కార్మికుల ఆకలి తీర్చాము. పుష్కరాలు, దసరా ఉత్సవాల సమయంలో లక్షల మంది దూరప్రాంతాల నుంచి తరలివస్తుంటారు.

 

వారి ఆకలి తీర్చే బాధ్యతనూ మా అన్నపూర్ణ ట్రస్టు తీసుకుంది అని తెలిపారు జ్యోతి. విజయవాడ సహా చుట్టుపక్కల ఉండే వసతి గృహాలు, ఆశ్రమాలకు వెళ్లి ఏటా 500మంది దివ్యాంగ పిల్లలకు అవసరమైన ఆహారం, వివిధ పరికరాలు అందిస్తున్నారట. అదేవిధంగా నగరంలోని ఫుట్‌పాత్‌లపై నివసించే అనాథ వృద్ధులకు దుస్తులు, దుప్పట్లు అందిస్తున్నారట. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు టైలరింగ్‌ సహా పలు రకాల శిక్షణలు అందిస్తున్నారు. విజయవాడ చుట్టుపక్కల ఉన్న 10 గోశాలలకు అవసరమైన ఆహారం, ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ సేవలకుగానూ అనేక పురస్కారాల్ని అందుకున్నారు. అవార్డుల కన్నా అన్నం పెట్టడంలోనే ఎక్కువ ఆనందం ఉందంటున్నారు జ్యోతి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -