TDP Leader: వదల బొమ్మాళి వదలా.. ఆ ప్రముఖ నేత టీడీపీని వీడతారనే ప్రచారంలో నిజం లేదట!

TDP Leader: వైసీపీలో ఉన్నంత వరకు అందరూ గొప్పోల్లే. ఒకవేళ పొరపాటున పార్టీ మారితే ఆ నాయకులపై సంఘ విద్రోహ శక్తులుగా కూడా ముద్రవేయడానికి వైసీపీ నేతలు వెనకాడరు. పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారిని ఏదో ఒకరకంగా డీ గ్లామరస్ చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రత్యేకించి పార్టీలో ఎవరి గురించో చెప్పాల్సిన అవసరం లేదు. వైసీపీకి ఎదురు తిరిగిన షర్మిల, సునీతపై ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారో చూడొచ్చు. వారిద్దరికి అసలు వైఎస్ తో సంబంధాలే లేవని ప్రచారం చేస్తున్నారు. అలాంటిది పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఇతర నాయకులు పరిస్థితి ఎలా ఉంటుందో చూడొచ్చు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంతు వచ్చింది. ఆయన ఇటీవలే వైసీపీని వీడి టీడీపీలో చేరారు.

ఆయన గత ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు తీవ్రంగా ప్రయత్నించారు. గత ఎన్నికల్లో నెల్లూరులో వైసీపీ పదికి పది స్థానాలు గెలుచుకుంది. కానీ, ఈసారి 2 స్థానాలు కూడా గెలవడం కష్టమని సర్వేలు చెబుతున్నాయి. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనంరాంనారాయణ రెడ్డి వంటివారితో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వారు పార్టీని వీడటంతో నెల్లూరులో వైసీపీ బాగా వీక్ అయింది. వీరంత జగన్ వైఖరి నచ్చక.. పార్టీపై తీవ్రమైన ఆరోపణలు చేసి బయటకు వచ్చారు. వారిని డీ గ్లామరస్ చేస్తే కొత్త నష్టాన్ని పూడ్చకోవచ్చిన వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై జగన్ టీం గత కొంతకాలంగా సంచలన ఆరోపణలు చేస్తూ వస్తుంది.

టీడీపీ అధిష్టానం ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తూ ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. కోవూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఉన్నారు. వేమిరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ఆరాధ్యదైవంలా చూసిన నల్లపురెడ్డి… కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రత్యర్ధిగా మారగానే ఆ దంపతులను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నిత్య పెళ్లికొడుకు అంటూ కొన్ని రోజుల క్రితం సంబోంధించారు. అప్పుడు ఆ కామెంట్స్ సంచలనంగా మారాయి. ప్రసన్న వ్యాఖ్యలపై కూటమి నేతలు తీవ్రస్థాయిలో భగ్గుమంటున్నారు. నల్లపురెడ్డి వ్యాఖ్యలపై ప్రశాంతి రెడ్డి గతంలోనే స్పందించారు. ప్రభాకర్ రెడ్డితో తన పెళ్లి ఎలా జరిగిందో ఆమె అనుచరులతో జరిగిన సమ్మేళనంలో వివరించారు. ఇక ఇక్కడితో ఆ ఇష్యూ సర్దు మనిగింది. ఆ టాపిక్ మళ్లీ తెరపైకి రాలేదు.

కానీ అనూహ్యంగా వేమిరెడ్డి దంపతులు మళ్లీ పార్టీ మారబోతున్నారని సోషల్ మీడియాలో వైసీపీ నేతలు ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. వారు ఇష్టపూర్వకంగా టీడీపీలోకి వెళ్లలేదని తిరిగి వైసీపీలోకి వచ్చేస్తారని వరుసగా పోస్టులు పెడుతున్నారు. దీంతో ఆ రూమర్స్ పై వేమిరెడ్డి దంపతులు మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు. వైసీపీ నేతలు చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని.. ఓటమి భయంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో తమకు వస్తున్న ఆదరణ చూడలేకే వదంతులు సృష్టిస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై ప్రశాంతి రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. సాయిరెడ్డి విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని ప్రశాంతిరెడ్డి విమర్శించారు. జిల్లా మహిళలంతా తనకు మద్దతుగా ఉన్నారని ఆమె తెలిపారు. ప్రజల్లో తనకు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక… వైసీపీలో ఉన్న తన దగ్గరి బంధువులు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆవేదన చెందారు. అంతేకాదు.. నోటికొచ్చినట్టు మాట్లాడితే బాగోదని ప్రభాకర్ రెడ్డి దంపతులు వార్నింగ్ ఇచ్చారు. వేమిరెడ్డి దంపతుల రియాక్షన్ తో కొద్దొ గొప్పొ ఉన్న అనుమానాలు అన్ని పటాపంచులు అయ్యాయి. ఆయన మళ్లీ వైసీపీకి వెళ్లే ప్రసక్తే లేదని తేలిపోయింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -