Vijayasai Reddy: రూటు మార్చిన విజయసాయిరెడ్డి.. రాజమండ్రిపై టార్గెట్

Vijayasai Reddy: వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజమహేంద్రవరంపై టార్గెట్ పెట్టారు. విజయసాయిరెడ్డిది నెల్లూరు జిల్లా. విశాఖపట్నంతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. రాజకీయంగా, ప్రభుత్వ పరంగా కూడా ఆయన విశాకపట్నంలో ఎలాంటి సంబంధం లేదు. ఉత్తరాంధ్రకు వైసీపీ ఇంచార్జ్ గా వైవీ సుబ్బారెడ్డి వ్యవహరిస్తున్నారు. విశాఖలో విజయసాయిరెడ్డికి ఎలాంటి పని లేకపోయినా రోజు అక్కడే ఉంటారు. అక్కడ నుంచి రాజకీయం నడుపుతూ ఉంటారు.విశాఖలోనే త్రిబుల్ బెడ్ రూం ప్లాట్ కొనుగోలు చేసి విజయసాయిరెడ్డి అక్కడే గడుపుతున్నారు. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని వస్తుందంటూ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి విజయసాయిరెడ్డి విశాఖపట్నంలోనే మకాం వేశారు.

విశాఖపట్నం నుంచి విజయసాయిరెడ్డి ఎక్కడికి కదలం లేదు. విశాఖపట్నంలోనే పుట్టినట్లు, అక్కడే పెరిగినట్లు విజయసాయిరెడ్డి ప్రవర్తిస్తున్నారు. విశాఖపట్నంలో భారీగా విజయసాయిరెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారని, అక్కడ ప్రజల నుంచి భూములను లాక్కున్నారనే విషయాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. పత్రికల్లో ఆయన భూకబ్జా, భూముల కొనుగోలుకు సంబంధించి వార్తలు వస్తున్నాయి. విశాఖ చుట్టుపక్కల తన బినామీలు, తన బంధువుల పేరిట విజయసాయిరెడ్డి భూములు కొనుగోలు చేశారనే విషయం బయపటపడింది. పరిపాలన రాజధాని విశాఖ చుట్టుపక్క భూములను విజయసాయిరెడ్డితో పాటు వైసీపీ నేతలు కొనుగోలు చేశారని చెబుతు్న్నారు.

ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా అక్రమాలు పాల్పడ్డారని, భూములు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని పత్రికల్లో ఫుంఖాలుపుఖాలుగా వార్తలు వస్తున్నాయి. విశాఖలో విజయసాయిరెడ్డి భూ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే విశాఖపట్నం వదలేసి ఇప్పుడు రాజమండ్రిపై విజయసాయిరెడ్డి కన్నేశారని చెబుతున్నారు. తాజాగా రాజమండ్రిలో చల్లని స్వచ్చమైన గాలులు వస్తున్నాయని వరల్డ్ ఎయిర్ ఇండెక్స్ నమోదు చేసిందంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. బారత్ లో స్వచ్చమైన గాలులు వస్తోందని ఇండియాలో ఒక్క రాజమండ్రిలోనూ అంటే ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీంతో విశాఖల దొచుకోవడం అయిపోయిందని, ఇక విజయసాయిరెడ్డి కన్ను పచ్చని రాజమహేంద్రవరంపై పడిందని నెటిజన్లు కామెంట్ చేస్తోన్నారు.

విజయసాయిరెడ్డి అల్లుడికి చెందని అరబిందో కాకినాడలో పోర్టులతో పాటు ఫార్మా సెట్ ను జీఎంఆర్ సంస్ధ నుంచి కొనుగోలు చేసింది. దీంతో ఇప్పుడు వాటిని రాజమండ్రిలో ఏమైనా విస్తరిస్తున్నారేమోనని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తోన్నారు. విశాఖపట్నంలో దోచుకోవడం అయిపోయిందని, ఇక విజయసాయిరెడ్డి కన్ను రాజమండ్రిపై పడిందని చెబుతున్నారు. రాజమండ్రి కూా పెద్ద నగరంగా ఉంద. స్మార్ట్ సిటీ జాబితాలో ఉంది. ఎయిర్ పోర్టుతో పాటు సకల సౌకర్యాలు, సదుపాయాలు ఉన్నాయి. ఏపీలో పెద్ద సిటీగా రాజమహేంద్రవరం ఉంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి కన్ను రాజమండ్రిపై పడటం, రాజమండ్రిని పొగుడుతూ ట్వీట్ చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి,

అయితే దీపావళి సందర్భంగా క్రాకర్ కాల్చడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పొల్యూషప్ పెరుగుతుందని, అందుకే ఏ ప్రాంతంలో ఎంత పొల్యూషన్ పెరిగిందనేది వలర్డ్ ఎయిర్ ఇండెక్స్ అంచనా వేస్తోంది. ఇది సంవత్సరానికి వచ్చే నివేదిక కాదు. ఎప్పటికప్పుడే ఏయే ప్రాంతంలో ఎంత పొల్యూషన్ ఉందనేది అంచాన వేస్తోంది. దీపావళి కావడంతో ఏయే ప్రాంతంలో ఏంత పొల్యూషన్ పరిగిందనే వలర్డ్ ెయిర్ ఇండెక్స్ అంచనా వేసి వివరాలు వెల్లడించింది. అందులో రాజనమహేంద్రవరంలో పొల్యూషన్ తక్కువా ఉంది. విజయసాయిెడ్డికి ఇది తెలియక అది ఏంటో గొప్ప విషయంలా ట్వీట్ చేశారనే విమర్శలు వస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -