Vijayashanthi: కేసీఆర్ పాలనపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Vijayashanthi: తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పేరు నాయకురాలు విజయశాంతి. మెుదట ప్రత్యేక పార్టీ పెట్టిన కేసీఆర్ ఆహ్హానం మేరకు అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆ పార్టీని విలీనం చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం కలిసి పోరాటం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాములమ్మని పట్టించుకోలేదు. దీంతో బీజేపీలో చేరారు. అప్పటి నుంచి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో రాములమ్మ పోరాటం చేస్తోంది.తాజాగా పేపర్ లీక్, రాష్ట్ర అప్పులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాజకీయాల్లో విజయశాంతికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎప్పుడు ఏ పార్టీలో ఉన్న ప్రజల కోసం పోరాడే నాయకురాలని పేరుంది. కేసీఆర్ మోసం చేసిన ఎక్కడా వెనక్కి తగ్గకుండా, ఆయనపై పోరాటం సాగిస్తోంది. కొన్ని రోజుల క్రితం పేపర్ లీక్, లిక్కర్ కేసు సంచలనంగా మారాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు పేపర్ లీక్ చేయించారని అరెస్ట్ కూడా చేశారు. అయితే ఆ తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చింది. తాజాగా ఈ అంశంపై కేసీఆర్ పై విజయశాంతి విరుచుకుపడింది.

 

ఈ ఏనిమిదేళ్ల కాలంలో 5 లక్షల కోట్ల అప్పు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏమనాలని ప్రశ్నించారు. రాష్ట్ర ఖజనా మెుత్తం దోచేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ గడ్డను, అప్పుల కుప్పగా మార్చారని రాములమ్మ మండిపడ్డారు. అటు పేపర్ లీక్ లో బండి సంజయ్ ను ఇరికించటంపైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సిగ్గుందా కేసీఆర్ అని నిలదీశారు.

Related Articles

ట్రేండింగ్

Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్...
- Advertisement -
- Advertisement -