Virat: విరాట్ కోహ్లీ ఎంత మందితో లవ్ ఎఫైర్ నడిపించాడో తెలుసా?

Virat: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ కపుల్‌లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒకరు. 2017, డిసెంబర్ 11న ఈ జంట ఘనంగా పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను కోహ్లీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే అనుష్క శర్మ కంటే ముందు కోహ్లీ కొందరితో లవ్ ఎఫైర్ నడిపాడు. ఈ విషయం అందరికీ తెలియదు. తెలిసినవాళ్లు మాత్రం కోహ్లీ క్రికెట్‌లోనే కాదు నిజజీవితంలోనూ ఆల్‌రౌండరే అంటూ సెటైర్లు వేస్తున్నారు.

 

విరాట్ కోహ్లీ లవ్ ఎఫైర్ నడిపిన వాళ్లలో హీరోయిన్ సంజనా గల్రానీ కూడా ఉంది. బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసింది. ఆ సమయంలో కోహ్లీతో సన్నిహితంగా ఉండేది. ఈ విషయం గురించి మీడియా ప్రశ్నిస్తే మాత్రం కేవలం తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని.. మిగతా వదంతులు పుకార్లు మాత్రమేనని ఖండించడం జరిగింది.

అటు 18 ఏళ్ల వయసులోనే కోహ్లీ డేటింగ్ చేసేవాడు. అలా కన్నడ నటి సాక్షి అగర్వాల్‌తో కూడా అతడు ఎఫైర్ నడిపించాడు. అయితే కొంతకాలం తర్వాత సాక్షి అగర్వాల్ తనకు మంచి స్నేహితురాలు అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. మరోవైపు 2007 ఫెమీనా మిస్ విజేత సారాజైన్ డయాస్‌తో కూడా కోహ్లీ చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. ఆమెను 2011 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ కోహ్లీ ప్రత్యేకంగా ఆహ్వానించడం అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. కానీ 2011, జూలై తర్వాత వీళ్ల బంధానికి తెరపడింది.

తమన్నాతోనూ కోహ్లీకి ఎఫైర్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా కూడా కోహ్లీ ఎఫైర్ల జాబితాలో ఉంది. అయితే ఓ యాడ్‌లో మాత్రమే తాము కలిశామని.. కనీసం స్నేహితులు కూడా కాదని తమన్నా తనపై వస్తున్న రూమర్లను ఖండించింది. అటు ఇజాబెల్లె లైట్, డానీ వాట్‌తోనూ కోహ్లీ ఎఫైర్లు నడిపినట్లు రూమర్లు వచ్చాయి. కాగా నిజానికి విరాట్ కోహ్లీ కంటే అనుష్క శర్మ ఆరు నెలలు పెద్ద కూడా. అనుష్క శర్మ 1988, మే 1న జన్మిస్తే, విరాట్ కోహ్లీ నవంబర్ 5, 1988న పుట్టాడు. అయినా వీరిద్దరు కూడా పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -