Virat Kohli: మనం అవమానించాం.. వాళ్లు ఆచరిస్తున్నారు.. కోహ్లీ చూపిన దారిలో నడుస్తున్న బెన్ స్టోక్స్

Virat Kohli: టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ లోనే నిష్క్రమించిన టీమిండియా వన్డే ఫార్మాట్‌లో కూడా తడబడుతోంది. భారత జట్టుకు ఐసీసీ ట్రోఫీ అందిస్తాడని ఏరికోరి నియమించిన రోహిత్ శర్మ.. కెప్టెన్‌గా ఆసియా కప్ తో పాటు తొలి ఐసీసీ ట్రోఫీలో కూడా తడబడ్డాడు. టీ20 ప్రపంచకప్ ఓడిన తర్వాత చాలా మంది ’బీసీసీఐ వజ్రాన్ని వెతికే క్రమంలో బంగారాన్ని కోల్పోయింది’ అని కోహ్లీకి మద్దతుగా కామెంట్లు చేశారు. భారత క్రికెట్ జట్టుకు ఐసీసీ ట్రోఫీ అందించలేదనే ఒకే ఒక్క లోటు తప్ప టీమ్‌కు విదేశాలలో విజయాలు అందించిన అతికొద్దిమంది సారథుల్లో కోహ్లీ ముందువరుసలో ఉంటాడు.

పరిమిత ఓవర్ల ఫార్మాట్ సంగతి పక్కనబెడితే టెస్టు క్రికెట్ లో కోహ్లీ రికార్డులు చెరిగిపోనివి. కెప్టెన్‌గా కోహ్లీ టెస్టులలో 68 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 40 విజయాలున్నాయి. భారత్ లో కోహ్లీ సారథ్యంలో భారత్ 24 సిరీస్ లు ఆడి 18 సిరీస్ లలో విజయాలు సాధించింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాను వారి దేశాలలో ఓడించడం కోహ్లీ కెప్టెన్సీలోనే జరిగింది. భారత జట్టుకు అగ్రెసివ్ ఆటను నేర్పించడంలో కోహ్లీ సఫలీకృతుడయ్యాడు. ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, ఇంగ్లాండ్ లో 2021 లో లార్డ్స్ టెస్టులో స్టన్నింగ్ విక్టరీతో కోహ్లీ దూకుడు ప్రపంచానికి తెలసింది.

ఫాలో అవుతున్న స్టోక్స్..

ఇప్పుడు ఇదే దూకుడును ఇంగ్లాండ్ కూడా ఫాలో అవుతున్నది. జో రూట్ సారథ్యంలో అత్యంత దారుణంగా విఫలమైన ఇంగ్లాండ్ జట్టు.. బెన్ స్టోక్స్ కు కెప్టెన్సీ ఇచ్చాక ఓటమన్నదే లేకుండా దూసుకుపోతున్నది. ఈ ఏడాది జూన్ లో రూట్ నుంచి సారథ్య పగ్గాలు అందుకున్న స్టోక్స్.. కొత్త కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌లు ఇదే దూకుడు ఫార్ములాను పుణికిపుచ్చుకున్నారు. తమ దూకుడు ఆటతీరుకు ఇంగ్లాండ్ పెట్టుకున్న పేరు ‘బజ్ బాల్’. ఈ పదానికి క్లుప్తంగా అర్థం చెప్పాలంటే టెస్టు క్రికెట్ ను కూడా వన్డే, టీ20ల మాదిరిగా చేయడం. దూకుడుగా, భయం లేకుండా ఆడటం. బెన్ స్టోక్స్ – మెక్‌కల్లమ్ లు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు.

పాకిస్తాన్ తో ఇటీవలే ముగిసిన రావల్పిండి టెస్టులో బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ పై తొలిరోజే 506 పరుగులు చేయడం.. పాకిస్తాన్ ముందు ఊరించే లక్ష్యాన్ని పెట్టి వారిని బోల్తా కొట్టించడం బజ్ బాల్ లో భాగమే. అయితే ఇంగ్లాండ్ చేస్తున్న ఈ బజ్ బాల్ ఆటను కోహ్లీ ఎప్పుడో చేసి చూపించాడు. 2021లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా.. లార్డ్స్ టెస్టులో చివరి రెండు సెషన్లు ఉండగా ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. 60 ఓవర్లలో ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించింది. రెండు సెషన్లలోనే వారి గడ్డపై ఇంగ్లాండ్ ను ఆలౌట్ చేసింది.

ఓసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు కోహ్లీ.. అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టులో ఫలితం తేలేందుకు అగ్రెసివ్ ఆటనే ఆడతామని.. డ్రా అనేది తమకు చివరి ఆప్షన్ అని చెప్పాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ చెబుతున్నదీ అదే. మేం ఫలితం కోసం ఆడుతున్నాం. డ్రా కోసం కాదు. రిస్క్ అయినా సరే ఫలితం కోసమే ఆడతాం అంటున్నది. ఇంగ్లాండ్ కంటే ముందే ఈ సూత్రాన్ని కోహ్లీ పాటించి చూపెట్టాడు. ఇప్పుడు బెన్ స్టోక్స్ కూడా ఇదే ఫాలో అవుతున్నాడని కోహ్లీ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -